-క్షేత్ర స్థాయి అధికారుల సమన్వయంతో గ్రీవెన్స్‌ను పరిష్కరించండి..
-బడిమానిన పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టండి.
-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి హామి పనుల నిర్వహణలో లక్ష్యాల సాధన, రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఇ పంట నమోదు లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, శాఖల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, బడిమానిన పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన జిల్లా అధికారులకు సూచించారు. ఉపాధి హామి, రెవెన్యూ సదస్సులు, గ్రీవెన్స్ పరిష్కారం, డ్రాప్ అవుట్ పిల్లల గుర్తింపు, ఇ`పంట, హౌసింగ్ , విలేజ్ డవలప్‌మెంట్ ప్లాన్, తదితర అంశాలపై సోమవారం జిల్లా కలెక్టర్ డా. జి. సృజన నగరంలోని ఆమె విడిది కార్యాలయం నుండి జిల్లా అధికారులతో కలిసి డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామి పనుల నిర్వహణలో నిర్థేశించిన లక్ష్యాల సాధనపై క్షేత్ర స్థాయి అధికారులు మరింత దృష్ట సారించాలన్నారు. ఈనెల 16వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల ను నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలన్నారు. అంతర్ శాఖలు, క్షేత్ర స్థాయి అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలు పునరావృతం కాకుండా పారదర్శకంగా నిర్థిష్టమైన స్పష్టతతో పరిష్కరించాలన్నారు. ఆర్థిక పరమైన ఆర్జీల పరిష్కారంలో ఆర్జీదారులు సంతృప్తి చేందేలా త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సమాదానం ఇవ్వడంతో పాటు ప్రాధాన్యత క్రమంలో వాటిని పరిష్కరించడం ద్వారా ప్రజలకు నమ్మకాన్ని కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయంతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చినప్పుడు ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలలో జిల్లాకు సంబంధించిన ఆర్జీలను అన్‌లైన్ ద్వారా కలెక్టర్ డ్రాప్ బాక్సు నందు ఉంచడం జరుగుతుందన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపుతామని, తక్షణమే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుని నివేదికను సమర్పించాలని సంబంధిత సమాచారాన్ని సియంవో లాగిన్‌లో అప్‌లోడ్ చేసి గ్రీవెన్స్‌లో క్లియర్ చేయడం జరుగుతుందన్నారు.
బడిమానిన పిల్లలను గుర్తించి తిరిగి బడిలో చేర్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. ప్రతి గ్రామ వార్డు సచివాలయం పరిధిలో బృందాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటిని తప్పక సందర్శించి కుంటుంబంలో 5 సంవత్సరాల నుండి 17 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల విద్యకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలన్నారు. పిల్లల పేరు, వయస్సు, తరగతి, చదివేది ప్రభుత్వ పాఠశాల లేదా ప్రైవేట్ పాఠశాల? తదితర పూర్తి సమాచారం నివేదికలో పొందుపచాలన్నారు. బడిమానిన పిల్లలను గుర్తిస్తే అందుకు గల కారణాలను నివేదికలో పొందుపరచాలన్నారు. ఈ ప్రక్రియను ఆగస్టు 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని 5 సంవత్సరాల నుండి 17 సంవత్సరాలలోపు వయస్సు గలిగిన ప్రతి ఒక చిన్నారిని బడిలో చేర్చాలన్నదే లక్ష్యంగా అధికారులు పూర్తి భాధ్యత వహించాలన్నారు.
ఉపాధి హామి పథకం ద్వారా పని కోరిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడంతో పాటు చేపట్టిన పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామిలో ఆగస్టు 31వ తేదీ నాటికి హార్టికల్చర్ ప్లాంటేషన్ పూర్తి కావాలన్నారు. గృహ నిర్వహణ శాఖకు సంబంధించి బిలో బెసిమెంట్ స్థాయి నుంచి బెసిమెంట్ స్థాయికి తీసుకురావాలని, వారం రోజులలో స్టేజ్ కన్వర్షన్ జరిగి ఏ మండలంలోను జీరో ప్రోగ్రస్ ఉండరాదన్నారు. ఈ మాసాంతానికి ఇ` పంట నమోదు పూర్తి కావాలని, భూమిపై క్షేత్ర స్థాయిలో వ్యవసాయం చేసే వారి పేరు నమోదై ఉండాలన్నారు. జిల్లాలో 55,560 సిసిఆర్‌సి కార్డులు మంజూరు లక్ష్యానికి గాను ఇప్పటివరకు 36,729 కార్డులు పంపిణీ జరిగాయని మిగిలిన వాటిని ఆగస్టు 31వ తేదీ నాటికి నూరు శాతం పంపిణీ పూర్తి చేయాలన్నారు. గ్రామాలలో అన్ని మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పించేందుకు విలేజ్ డవలప్‌మెంట్ ప్లాన్ రూపొందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. దశల వారిగా గ్రామాలలో అందుబాటులో ఉన్న వనరులతో రహదారులు, డ్రైయిన్లు, ఇంటింటికి కూళాయి, వ్యక్తిగత మరుగుదొడ్లు, స్ట్రీట్ లైట్స్, కల్పించేందుకు డియంఎఫ్ నిధులు, ఉపాధి హామి, ఎంపి ల్యాండ్స్ నిధులతో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.
ఈనెల 16వ తేదీ నుండి 45 రోజుల పాటు నిర్వహించే రెవెన్యూ సదస్సులపై గ్రామాలలో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించి ఏ రోజు ఏ సదస్సు ఎక్కడ నిర్వహించేంది షెడ్యూల్ రూపొందించుకుని 24 గంటల ముందు గ్రామాలలో టాం..టాం.., మైక్ ప్రచారం, ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయాలన్నారు. రెవెన్యూ సదస్సులలో నమోదు అయ్యే ప్రతి ఆర్జీ రిజిస్టర్ చేసి ఎకనాలెడ్జమెంట్ తప్పని సరిగా ఇవ్వలన్నారు. పైన పేర్కొన్న విషయాలపై ప్రతి రోజు ఉదయం 7 గంటలకు టెలికాన్ఫరెన్స్‌ద్వారా సంబంధిత జిల్లా అధికారులు, క్షేత్ర స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని నివేధికలతో సిద్దంగా ఉండాలన్నారు. అప్పగించిన భాధ్యతలపై అలసత్వం వహిస్తే ఉపేక్షించబోనని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన సంబంధింత అధికారులను ఆదేశించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా, అసిస్టెంట్ కలెక్టర్ శుభం కుమార్, డిప్యూటి కలెక్టర్ ఇ. కిరణ్మయి డిఆర్‌వో వి. శ్రీనివాసరావు, డ్వామా పిడి జె. సునీత, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాసరావు, డిఇవో యు వి సుబ్బారావు, ఐసిడిఎస్ పిడి జి. ఉమాదేవి, పంచాయతీరాజ్ ఎస్ ఇ ఎ. వెంకటేశ్వరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ ఇ డివి రమణ, హౌసింగ్ పిడి రజిని కుమారి, డిఎస్‌వో మోహన్‌బాబు, జిల్లా వ్యవసాయ అధికారిణి ఎస్. నాగమణెమ్మ డిపివో శివ ప్రసాద్ యాదవ్, జిల్లా క్షయ నివారణ అధికారి డా. ఉషారాణి, ఎన్‌టిఆర్ వైద్య సేవా ట్రస్ట్ జిల్లా కో`ఆర్డినేటర్ డా. జె. సుమన్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.