Breaking News

నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో 27 అర్జీలు స్వీకరణ

-మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేందుకు స్పందన స్థానంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ కు శ్రీకారం చుటిందని నగరపాలక నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ అన్నారు. సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నగరపాలక సంస్థ కమీషనర్ కేతన్ గర్గ్ 27 అర్జీలను స్వీకరించామన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, పరిష్కారము చెయ్యాలని ఆదేశించడం జరిగిందన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలు:
ఉపాధి, పేరు మార్పు, పింఛన్లు, ఇంటి పన్ను, పారిశుధ్యం, డ్రైనేజి, మురుగు నీరు, వీధిలైట్స్ తదితర సమస్యలు పై అర్జీ దారుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు.

ఈ రోజు వచ్చిన అర్జీలు…
రాజమహేంద్రవరానికి చెందిన ఎస్. గణేష్ అనే వ్యక్తి తాను విశ్వకర్మ కులానికి చెందిన వాడిని ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ స్కీముకు తాను పూర్తి అర్హత కలిగి ఉన్నందున తనకు ఉపాధి కల్పించవలసినదిగా కోరుట.

రాజమహేంద్రవరానికి చెందిన గంట పాల్ ప్రవీణ్ అనే వ్యక్తి తన పేరులోని పాల్ అనే పదములోని స్పెల్లింగ్ అక్షరాలను సరిచేసి సర్టిఫికెట్ ఇప్పించవలసిందిగా కోరుట.

రాజమహేంద్రవరానికి చెందిన జి. ప్రేమ జ్యోతి అనే ఎస్సీ మహిళ తను ఆరవ తరగతి వరకు చదువుకున్నానని, తనకు ఉపాధి కల్పించవలసిందిగా కోరుట.

రాజమహేంద్రవరం చెందిన కే. శరణ్య అని మహిళా ఇరుగుపొరుగువారు తన ఇంటి వద్ద చెత్తను వేస్తున్నారని తగు చేయా తీసుకోవలసినదిగా కోరుట.

రాజమహేంద్రవరానికి చెందిన బి. ఆదినారాయణ అనే వ్యక్తి తను నివసిస్తున్న అపార్ట్మెంట్ లోని మోటారు వేయుటకు వెళ్లినందున అపార్ట్మెంట్ వాసులు తనను దుర్భాషలాడుతున్నందున చర్య తీసుకోవాల్సిందిగా కోరుట.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మునిసిపల్ అదనపు కమీషనర్ పి.యం సత్యవేణి, సూపర్నెంట్ ఇంజనీర్ జి పాండురంగారావు, సిటీ ప్లానర్ జి.వి.ఎస్. ఎన్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *