Breaking News

యువత మాధక ద్రవ్యాలు వినియోగం వైపు ప్రభావితులు కావద్దు.

-మాధక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలను  ప్రతి ఒక్కరికి   అవగాహన కల్పించాలి.
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
యువత మాధక ద్రవ్యాలు వినియోగం వైపు ప్రభావితులు కావద్దని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపునిచ్చారు. సోమవారం రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటుచేసిన మాధక ద్రవ్యాలు నియంత్రణ పై అవగాహన సదస్సు కు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తెలిసి గాని, తెలియక గాని మాదకద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దన్నారు. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన యువత మాధక ద్రవ్యాల బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని, దాని వలన కలిగే దుష్పరిణామాలను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని విద్యాసంస్థల్లో మాధక ద్రవ్యాలు నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని అందులో భాగంగా నేడు వ్యవసాయ కళాశాలలో అవగాహన సదస్సును నిరూపించుకుంటున్నామన్నారు. సమాజంలో నేడు సుమారు 70 శాతం మంది ఆల్కహాల్ తీసుకుంటున్నారన్నారు. అలాగే డ్రగ్స్ గంజాయి సింథటిక్ ఇతర మత్తు పదార్థాలను కూడా వినియోగిస్తున్నారని వీటిని అరికట్టే దిశగా మాదకద్రవ్యాల నియంత్రణ పట్ల ప్రజలను చైతన్యం వంతులను చేస్తూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించడం వలన నివారణ సాధ్యమవుతుందన్నారు. యువత కొత్తదనం పట్ల ఆకర్షితులవుతారని ఒకసారి చేసి చూద్దామనే భావన లో ఉండి ఆ దిశగా ప్రభావితులవుతారన్నారు. ముందుగానే మాదక ద్రవ్యాలు వంటి మత్తు పదార్థాలు వినియోగించడం వలన వచ్చే అనర్ధాలను అవగాహన కార్యక్రమాల ద్వారా తెలియజేయాలి అన్నారు. మాదకద్రవ్యాలు వినియోగం వల్ల నరాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు బానిశలుగా మారకుండా ఉండడానికి విద్యా ర్థులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ అవగాహన కార్యక్రమం పాల్గొన్న వ్యక్తులు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారి భవిష్యత్తు, ఆరోగ్యం ప్రశ్నార్ధకంగా మారుతుందని నియత్రనే లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాధక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు నియంత్రణ దిశగా అలవాటు పడిన వారిని డి – అడిక్షన్ సెంటర్లో నయం చేయాలన్నారు. అప్పుడే మనం కోరుకున్న మాధక ద్రవ్య రహిత ఆంధ్ర ప్రదేశ్, భారతదేశము సాధ్యమవుతారని ఆశా భావం వ్యక్తం చేశారు. సమాజ శ్రేయస్సు కొరకు మాదకద్రవ్యాల నియంత్రణ ఎంతో ముఖ్యమని, వాటికి దూరంగా ఉంటామని ముక్తకంఠంతో చెప్పి “నశా ముక్త్ భారత్ అభియాన్” క్రింద బోధన బోధ నేతర సిబ్బంది, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కే ఎల్.శివజ్యోతి, ఐసిడిఎస్ పిడి కే విజయలక్ష్మి, ఏపీఎస్పి సి ఆర్ మెంబర్ టి. ఆదిలక్ష్మి, విజిలెన్స్ అదనపు ఎస్పీ సోమ శేఖర్, డి సి పి ఓ రాజ్ కుమార్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. డి. శ్రీనివాస్,బోధన బాదనేత్ర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *