విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజవర్గంలో అందరికీ ఆరోగ్యమనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల ముందు పశ్చిమ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పాటుపడుతున్నారు. అరవై రోజుల తన పాలనలో నియోజకవర్గంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు, వికలాంగులకు, కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సేవలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకుంటున్నారు. ఆగస్టు 10వ తేదీన భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా అంచనాలకు మించి విజయవంతం అవడంతో మరింత జోష్ తో ముందుకు వెళుతున్నారు. ఎంతోమంది చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. పశ్చిమ ప్రజల ఆరోగ్యమే తన ఆరోగ్యంగా ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించి ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించి సామాన్యులకు కార్పొరేట్ వైద్యం అందించి, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యా ,వైద్యం, ప్రజారోగ్యం, మీద ప్రత్యేక దృష్టి పెడుతూ ఎన్డీయే కూటమి, ప్రభుత్వ అధికారుల సహకారంతో,పశ్చిమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్క శాసనసభ్యుడు సుజనాను రోల్ మోడల్ గా భావించాలని పశ్చిమ ప్రజలు కోరుకుంటున్నారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …