Breaking News

యూనియన్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో పార్టిషన్ హారర్స్ రేమెంబ్రన్స్ డే ఫోటో ఎగ్జిబిషన్ అలిపిరి వద్ద ప్రారంభం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి మంగళవారంయూనియన్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో పార్టిషన్ హారర్స్ రేమెంబ్రన్స్ డే ఫోటో ఎగ్జిబిషన్ ను యూనియన్ బ్యాంక్ తిరుపతి రీజనల్ హెడ్ జి రాంప్రసాద్ అలిపిరి వద్దనున్న యూనియన్ బ్యాంక్ ఎటిఎం పక్కన ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ మాట్లాడుతూ నేడు విభజన భయాందోళన సంస్మరణ దినం (పార్టిషన్ హారర్స్ రేమెంబ్రన్స్ డే) పురస్కరించుకొని ఎగ్జిబిషన్ ప్రారంభించామని, మూడు రోజులు పాటు ఆగస్టు 13వ తేది నుండి 15 వ తేది వరకు ఎగ్జిబిషన్ తిలకించడానికి సందర్శకులు రావచ్చని, నేడు స్థానిక బ్యాంకు బ్రాంచ్ మేనేజర్లు కార్యక్రమాన్ని సందర్శించారని, ప్రజలు, విద్యార్థులు సందర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్డిఎం విశ్వనాథ రెడ్డి , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *