గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలందరు హర్ ఘర్ తిరంగాలో భాగంగా నగరంలోని ప్రతి ఇంటి పై జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశ భక్తిని చాటుకోవాలని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు మరియు నగర కమీషనర్ పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా లో భాగంగా గుంటూరు నగరంలో ప్రతి ఇంటింటా జాతీయ జెండాను ఎగురవేసి 78వ స్వాతంత్ర్య దినోత్స కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలన్నారు. ఇప్పటికే నగరంలో పలు స్వచ్చంద సంస్థలు, విద్యా సంస్థలు, విధా సంఘాలు జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించుట దేశ భక్తిని ఇనుమడింప చేయుచున్నదన్నారు. బుధవారం నగర పాలక సంస్థ కార్యాలయంలోని అధికారులు మరియు సిబ్బందితో పాటు తాము కూడా తమ ఛాంబర్ల యందు జాతీయ జెండాతో సెల్ఫి ఫోటో దిగి కేంద్ర ప్రభుత్వ నిర్దేసహించిన విధంగా http://harghartiranga.com వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి, హర్ ఘర్ తిరంగా ప్రశంసా పత్రం పొందుట జరిగిందన్నారు. కావున నగరంలోని ప్రజలందరూ జాతీయ జెండాతో దిగిన సేల్ఫీని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి ప్రశంసా పత్రాన్ని పొంది గుంటూరు నగర కీర్తిని రాష్ట్ర మరియు జాతీయ స్తాయిలో నిలపెట్టాలన్నారు.
Tags guntur
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …