-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర విద్యా సంస్థలు అయిన ఐఐటి, ఐసర్ కోర్టు పెండింగ్ కేసులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు వంటి పెండింగ్ అంశాలను మరియు ఇతర సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెస్ట్ గోదావరి, అనంతపురం కర్నూలు, విశాఖపట్నం గుంటూరు, కృష్ణజిల్లా తదితర కలెక్టర్లతో సమీక్షించగా తిరుపతి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ అక్విజేషన్ డిప్యూటీ తాసిల్దారు భాస్కర్ పాల్గొన్నారు.