-ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద్ ప్రకాష్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సివిల్ రైట్స్ చట్టం అమలు సక్రమంగా, సివిల్ రైట్స్ డే మండల స్థాయిలో తప్పక ప్రతి నెలాఖరు రోజున తప్పక జరపాలని, పోలీస్ యంత్రాంగం, సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆం.ప్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాశ్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్డీఓ కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్సీ కమిషన్ సభ్యులు గారు తిరుపతి డివిజన్ తాశిల్దార్లు, పోలీస్ అధికారులతో సివిల్ రైట్స్ డే పై సమీక్షిస్తూ ప్రతి నెలా ఆఖరు రోజున సివిల్ రైట్స్ డే తప్పక నిర్వహించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ లపై అట్రాసిటీ లు జరగకుండా వారికి భద్రత మన రాజ్యాంగం నుండి కల్పించబడింది అని, అసమానతలు ఉండరాదని అన్నారు. పేద వారిపై ఎస్సీ లపై ఎలాంటి దౌర్జన్యాలు జరగరాదని, అలాంటివి రిపోర్ట్ అయినప్పుడు నిబంధనల మేరకు తప్పక చర్యలు పోలీస్, రెవెన్యూ తదితర సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 67 లక్షల రూపాయలు పెండింగ్ కంపెన్సేశన్ ఉన్నవాటిని త్వరితగతిన క్లియర్ చేయాలని, నిధుల కొరత ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కొన్ని చోట్ల బాగా సివిల్ రైట్స్ డే జరుగుతున్నాయని, మరికొన్ని చోట్ల ఇంకా సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ నిషాంత్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, అట్రాసిటీ డిఎస్పీ లు, తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.