-19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయండి
-పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పగడ్భందీగా చేపట్టాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 17వ తేదీన స్వర్ణ భారత ట్రస్ట్ 23 వ వార్షికోత్సవానికి భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సతీ సమేతంగా హాజరు కానున్నారని మరియు ఈ నెల 19 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ సిటీ ని సందర్శించనున్నారని, పర్యటన ను అధికారులందరూ సమన్వయం తో సమిష్టి గా పనిచేసి విజయ వంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్.పి సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, డి.ఆర్.ఓ పెంచల్ కిషోర్ లతో కలసి ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ..ఉప రాష్ట్రపతి నెల్లూరు జిల్లా వెంకటాచలం నందు జరిగే స్వర్ణ భారత ట్రస్ట్ 23 వ వార్షికోత్సవానికి హాజరు కానున్నారని, రేణిగుంట ఎయిర్పోర్ట్ నందు లైజనింగ్ పటిష్టంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే ఈ నెల 19 వ తేదీన శ్రీ సిటి సందర్శన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ మరియు శ్రీ సిటి నందు హెలిప్యాడ్, పార్కింగ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.వాహనాల పార్కింగ్ సమస్య లేకుండా చూడాలన్నారు. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని, పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులు కలిసి పరిశీలన చేసి బ్యారికేడ్ లు ఏర్పాటు ను పూర్తి చేయాలన్నారు. హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలనన్నారు. ఫైర్ సేఫ్టీ జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. ఈ కార్య క్రమానికి వచ్చే ప్రజలకు ముందుగానే స్నాక్స్, త్రాగు నీరు పంపిణీ చేయాలన్నారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు, రిసెప్షన్ సెంటర్ పాయింట్ పక్కాగా ఏర్పాటు చేపట్టాలన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్షలో అడిషనల్ ఎస్.పి లు వెంకట్రావు, విమల కుమారి, సెబ్ అదనపు ఎస్పీ రాజేంద్ర , జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువీర్, సివిల్ సప్ప్లై మేనేజర్ సుమతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.శ్రీహరి, శ్రీ సిటీ జనరల్ మేనేజర్ నారాయణ భగవాన్, ఏ.పి.ఐ.ఐ.సి జెడ్.ఎం చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధి కారులు, ప్రజా ప్రతినిధులు తది తరులు పాల్గొన్నారు.