-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
-స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే స్వాతంత్ర దినోత్సవం – నగర కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు, కార్పొరేషన్ సిబ్బంది ఇద్దరు రెండు కళ్ళు లాగా విజయవాడ నగరపాలక సంస్థకు సమన్వయంతో సహకరిస్తూ ఉండటం వల్లనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ భాగ్యలక్ష్మి, విజయవాడ నగరపాలక సంస్థ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని అన్నారు.
విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. ముందుగా విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర, మహాత్మా గాంధీ గారి పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి జాతీయ జెండా పతాకావిష్కరణ చేసి జెండా వందనం చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర నగరపాలక సంస్థ జెండా పతాకావిష్కరణ చేశారు. ఎన్సిసి ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్, విద్యార్థులు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యాన చంద్ర గారికి గౌరవ వందనం చేసారు.
ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, కేవలం ప్రజలు కార్పొరేషన్ సిబ్బంది సహకారంతోనే నగరాభివృద్ధి సాధ్యమవుతుందని. దానికి నిదర్శనం స్వచ్ఛ సర్వేక్షన్ లో వస్తున్న ర్యాంకులని, విజయవాడ ఇలాగే దినదిన అభివృద్ధి జరగాలని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అని, విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాల గురించి అవగాహన కల్పించడం ఎంతో అవసరమని అన్నారు. తదుపరి విభిన్న శాఖలలో ప్రతిభావంతులకు, పురస్కారాలు అందించారు.
గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర, తో పాటు డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ రెడ్డి, కార్పొరేటర్లు ఉమ్మడి చంటి, సత్తిబాబు, రహమతున్నీసా, షాహినా సుల్తానా, అడిషనల్ కమిషనర్ జనరల్ డాక్టర్ ఏ మహేష్, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) కెవి సత్యవతి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ ఏం ప్రభాకర్ రావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి సృజన, అకౌంట్స్ ఎగ్జామినేనర్ చక్రవర్తి, ఎకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి, కార్పొరేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.