Breaking News

డీటీసీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

-జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన డిటిసి యం. పురేంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాల సైతం అర్పించి మన దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని అటువంటి మహనీయులను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని డిటిసి ఎం పురేంద్ర అన్నారు. స్థానిక బందరు రోడ్డు లోని డీటీసీ కార్యాలయంలో గురువారంనాడు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో డీటీసీ యం పురేంద్ర పాల్గోని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులకు ఉద్యోగులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా డీటీసీ యం. పురేంద్ర మాట్లాడుతూ దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు ఆగస్టు 15, 1947 తో తెరపడిందని, అప్పటినుండి భారతీయులు స్వయంపాలనకు తెరలేచిందన్నారు. దేశం కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా చేసిన పోరాటాల ఫలితంగా సాధించిన స్వాతంత్ర్యాన్ని ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నామని గుర్తుచేశారు. స్వాతంత్ర ఫలాలను ఎలాగైతే మనం అనుభవిస్తున్నామో అలానే దేశంపట్ల కూడా బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరు ఉండాలన్నారు. ఉద్యోగులుగా ప్రజలకు సేవలు చేసే అవకాశం మనకు దక్కడం ఎంతో అదృష్టమన్నారు. శాఖాపరంగా ప్రజలు కోరుకునే సేవలను సత్వరమే పరిష్కారించే విధంగా జిల్లాలోని అధికారులు ఉద్యోగుల పని చేయాలన్నారు. ప్రజలకు ఎప్పుడైతే పారదర్శకత తో సేవలను అందిస్తామో అది దేశానికి సేవ చేసినట్లేనని డీటీసీ పురేంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో మోటారు వాహన తనిఖీ అధికారులు ఆర్ ప్రవీణ్, వెంకటేశ్వరరావు, శివరామ గౌడ్, ఏపీ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు, కార్యాలయ పరిపాలనాధికారులు సిహెచ్ శ్రీనివాసరావు, అబ్దుల్ సత్తార్, కెవివి నాగ మురళి, ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె భద్రాచలం, అధికారులు ఉద్యోగులు, ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్స్, హోం గార్డ్స్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *