-ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కంపానియేన్ షిప్, సంస్థ నిర్వాహకులు గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సుజనా చౌదరి మాట్లాడుతూ తల సేమియా మరియు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న బాధితులకు రక్తం అందించడం ప్రాణదాతలతో సమానమని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కంపానియేన్ షిప్ ఫౌండర్స్, షబ్బీర్, సిరాజుద్దీన్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ డైరెక్టర్ ఇబ్రహీం, డాక్టర్ కళ్యాణిలను ఎమ్మెల్యే సుజనా అభినందించారు. గత సంవత్సర కాలంగా తల సేమియా బాధితుల కోసం 2000 మంది దాతల నుంచి రక్తం సేకరించామని స్వాతంత్ర దినోత్సవం రోజున 500 మంది రక్తదానం చేశారని నిర్వాహకులు షబ్బీర్ తెలిపారు. తల సేమియా ఫ్రీ అమరావతి క్యాంపెయిన్ లో భాగంగా చేస్తున్న ఈ కార్యక్రమాల్లో డోనర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బెగ్, టిడిపి సీనియర్ నాయకులు ఫతావుల్లా, తదితరులు పాల్గొన్నారు.