విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తండ్రి వారసత్వానికి వారసులుగా వ్యాపారరంగంలో, రాజకీయంగా, నటులుగా, ఆటలలో ఒకటేమిటి వివిధ రంగాలలో పరపతికి, పదవికి, తదనంతరం కొనసాగుతున్న ఇప్పటి పరిస్థితులలో… తండ్రి ఆశయ సాధనతో సామాజిక సేవా దృక్పథంతో పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్న తనంలోనే ఎందరో మన్ననలు పొందాడు గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్ కుమారుడు రేపటి గాంధీ కార్తీక్. ఒక్క మాటలో చెప్పాలంటే మహాత్మా గాంధీó, బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి రెండు కళ్ళవంటి వారని, అట్టడుగువర్గాల అభ్యున్నతికి వారు చేసిన కృషిని, త్యాగాలను ప్రజలకు ప్రచార రూపంలో తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో తాను నిండు వస్త్రధారణ నుంచి కొల్లాయిగా మారి వారి అడుగుజాడలలో నడుస్తున్న ఆర్.ఆర్.నాగరాజన్ నుండి గాంధీ నాగరాజన్‌గా మారిన ఆయన స్ఫూర్తి అభినందనీయం. అటువంటి వారి కడుపున పుట్టిన రేపటి గాంధీ తన చేతనైనంతలో హిందూ, ముస్లీం, క్రైస్తవులు లాంటి విభేదాలు లేకుండా కులమతాకు అతీతంగా అన్ని పండుగలకు తాను ముందున్నానని తను చేతనైనంతలో సాయం చేస్తూనే వస్తున్నాడు. గురువారం గాంధీ దేశం ట్రస్ట్ కార్యాలయం వద్ద 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేపటి గాంధీ కార్తీక్ భారత పౌరుడుగా తన వంతు బాధ్యతగా వేడకలలో భాగంగా పిల్లలకు తన స్వంత ఖర్చుతో పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, స్వీట్స్, చాక్లెట్స్, జెండాలు పంచిపెట్టారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపి దేశభక్తిని చాటుకున్నాడు. ఈ సేవాదృక్పధం ఎవరు ఎవరు నేర్పారని అతనిని మా ప్రతినిధి ప్రశ్నించగా మాతండ్రి గాంధీ నాగరాజన్ స్ఫూర్తి అని చెప్పిన మాటలు ఈనాటి భావితరాల బాలలకు స్పూర్తిదాయకం. గాంధీ నాగరాజన్ కుమారుడు రేపటి గాంధీ, గాంధీ ఆశయాలకు వారసుడిగా మాస్టర్ కార్తీక్‌ను హర్షిద్దాం. ఇప్పటి పరిస్థితులలో మానవ సంబంధాలు కనుమరుగవుతున్న తరుణంలో తండ్రి విలువ, సమాజం మనకు ఏమి చేసింది అని కాకుండా సమాజానికి మనం ఏం చేయాలి అనే సేవాదృక్పధాన్ని పిన్న వయసులో అలవర్చుకున్న కార్తీక్ మరింత అభివృద్ధి పథంలో ఎదగాలని, తండ్రి గాంధీ నాగరాజన్ ఆశయసాధనను అతను నెరవేర్చాలని ఆశీర్వదిద్దాం.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …