-ఎస్సీ ఎస్టీ కేసుల పై కేసులవారీగా నివేదిక అందజేయాలి
-పోస్టుల భర్తీల విషయంలో రోస్టర్ పాయింట్ ను కచ్చితంగా పాటించాలి
-త్వరలో ప్రజాప్రతినిధులతో డివిఎంసి కమిటీ సమావేశం నిర్వహిస్తాం
– కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
పి ఓ ఏ యాక్ట్ అమలు , మహిళల భద్రత ప్రాధాన్యత – ఎస్పికిషోర్ ఎస్సి ఎస్టీ లపై అఘాయిత్యాల నివారణ చట్టం అమలు చేస్తున్న తీరు, పెండింగ్ అంశాల పై కేసుల వారీగా సమగ్ర వివరాలు అందచేయాలని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, ఎస్పీ డి నరసింహ కిషోర్ , మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో అట్రాసిటీల నివారణ (పి ఓ ఏ) చట్టం పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా కేసుల వారీగా సమీక్ష చెయ్యాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల మార్గదర్శకాలు మేరకు విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించి ఉండలేదన్నారు. జిల్లాలో కేసులు వారీగా సమగ్ర వివరాలను అందజేయాలని అందుకు గల కారణాలతో పాటు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషన్ రాష్ట్రంలో పర్యటించిన దృష్ట్యా, జిల్లా ప్రజా ప్రతినిధులతో త్వరలో సమావేశం నిర్వహించి ఎస్సీ ఎస్టీ లకు సంబంధించిన కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. కేసుల పరిష్కార విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు, పరిహారం , కేసు స్థాయి, తదితర అంశాలపై అన్నీ ప్రభుత్వ శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు. కేసుల వారీగా సమగ్ర వివరాలను అందజేయాలని ఆదేశించారు. ఉద్యోగ నియామకాలు సంబంధించి రోస్టర్ పాయింట్ల వారీగా పోస్టుల భర్తీ పై శాఖలు నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. పౌర హక్కుల అమలు తీరుపై ప్రతినెలా చివరి శనివారం సందర్శన చేపట్టాలి, ఆమేరకు మండల స్థాయి అధికారులకి ఆదేశాలు జారీ చెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు. గత సమావేశంలో జరిగిన అంశాలు, పెండింగ్ అంశాల పై సమావేశంలో చర్చించడం జరిగింది. ఎఫ్ఐఆర్ స్టేజిలో 1509 ఛార్జ్ షీట్ స్టేజిలో 67 కన్వెన్షన్ స్టేజీలో ఒకటి ఉన్నట్లు అధికారులు వివరించారు. 2013-2022 మధ్య 20 కేసులు , 2023లో 28 కేసులు, జనవరి 2024 నుంచి జూలై 31 నాటికి 56 కేసులు విచారణ దశలో ఉన్నట్లు తెలియజేశారు. ఎస్సీ ఎస్టీలకు ముద్రలను మంజూరు, పరిశ్రమల శాఖ ద్వారా యూనిట్ల స్థాపన పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ఎస్పీ డీ నరసింహా కిషోర్ మాట్లాడుతూ, మహిళల భద్రత, పీ వో ఏ యాక్ట్ అమలు విషయం కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆ మేరకు పోలీసు అధికారులకు మార్గనిర్దేశం చేసినట్లు తెలిపారు. ఇందుకోసం సంబంధిత అధికారులతో కేసుల వారీగా జిల్లాలో ప్రత్యెక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరం కలిసి పనిచేసి ఆయా వర్గాల సాధికారిత కల్పించేలా బాధ్యతతో వ్యవహరించాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ పౌర హక్కుల అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నరు. గృహ రుణాల విషయంలో నాలుగు లక్షల వరకు ఎస్సీ ఎస్టీలకు రాయితీ కల్పించాలని గతంలో ఇల్లు మంజూరు చేసిన వారికి కూడా చేసిన వారికి కూడా వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలోకి ఎక్కువగా వైద్యం కోసం ఎస్సీ ఎస్టీలు వస్తారని వారికి వైద్య సేవలు అందించే క్రమంలో ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు కు వేగవంతం చేయాలని, కుల ధ్రువీకరణ పత్రాలను అర్హత మేరకు జారీచేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం సందీప్, అదనపు ఎస్పీఎస్ఆర్ రాజశేఖర్ రాజు, కమిటీ సభ్యులు ఐ సత్యనారాయణ ఏ చిన్నరాజు టీ బాలు కౌన్సిలర్లు బి జార్జి ఆంటోని డి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇతర జిల్లా అధికారులు డిఎస్పీలు తదితరులు హాజరయ్యారు.