Breaking News

నగర అభివృద్దే లక్ష్యంగా వంద రోజులు కార్యాచరణ ప్రణాళిక..

–  ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను చేపట్టి అమలు చేయడం జరుగుతుంది.
– తొలి దశలో మూడు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం.
-ప్రతి ఇంటికి త్రాగునీటి కొళాయి లక్ష్యంగా ఇంటింటి సర్వే చేపట్టాం.
-2027 లో జరుగునున్న గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికులకు సౌకర్యాలు కల్పన దిశగా కార్యాచరణ.
-నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగర అభివృద్దే లక్ష్యంగా వంద రోజులు కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను చేపట్టి అమలు చేయడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్. కేతన్ గార్గ్ తెలిపారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్డ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో వంద రోజుల కార్యాచరణ తో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నా మన్నారు. ఇందులో భాగంగా నేడు నగరంలోని క్వారీ సెంటర్ నందు ఒకటి, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నందు ఒకటి, సుబ్రహ్మణ్యం మైదానం ప్రాంతంలో ఒకటి చొప్పున మూడు అన్న క్యాంటీన్ లను నేడు తొలి దశలో అన్న క్యాంటీన్లు విజయవంతంగా ప్రారంభించుకున్నా మన్నారు. అన్న క్యాంటీన్ కు వచ్చే వారందరికీ ఉదయం టిఫిన్,మధ్యాహ్నం భోజనం,సాయంకాలం భోజనం సరిపడా టోకెన్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా అన్న క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రస్థాయిలోను, ఆర్ఎంసి స్థాయిలో వాటర్ టాప్స్ కు సంబంధించి సర్వే చేయడం జరుగుతుందని తెలియజేశారు. కచ్చితంగా ప్రతి ఇంటికి ఒక మున్సిపల్ ట్యాబ్ కనెక్షన్ ఉండాలని దిశగా రానున్న మూడు నాలుగు నెలల్లో కొత్తగా కొన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. సచివాలయం స్థాయిలో ఉన్నటువంటి మంచినీటి కొరతను నివారణ కొరకు ఇంటింటి సర్వే నిర్వహించి ఎవరికైతే త్రాగునీటి కొళాయి కనెక్షన్ ఇళ్లకు టాప్ కనెక్షన్ ఇచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఎస్ హెచ్ సి గ్రూప్స్ మహిళలు పిల్లలకు విద్యార్హతలను బట్టి ఎక్స్పీరియన్స్ అందుకు సరిపడా జాబ్ ఇప్పించే బాధ్యత తీసుకుంటామని తెలియజేశారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ డెవలప్మెంట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకుంటుందని తెలియజేశారు. అదేవిధంగా ప్రతిరోజు మన టౌన్ లో 165 టన్స్ వేస్టేజ్ ప్రెస్సింగ్ చేయడం జరుగుతుందని, భారత్ పెట్రోలియం మున్సిపల్ కార్పొరేషన్ వారు సంయుక్తంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా డిజైనింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ వే స్టేషన్ కూడా ఎనర్జీ కింద కన్వర్ట్ చేయటం జరుగుతుందని తెలియజేశారు. డ్రోన్స్ ద్వారా దోమలు యొక్క గుడ్లపై విష వాయువును ప్రయోగించి వాటిని అరికట్టి కార్యక్రమం చేసామని తెలియజేశారు. గంట సేపటి వరకు ఈ పైలెట్ రన్ జరుగుతుందన్నారు. అమ్యూజ్మెంట్ పార్క్, మ్యూజియం ఇతర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, రాబోయే పుష్కలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ పై ఒక సర్వే జరిగిందన్నారు. 2027 లో జరుగునున్న గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, వసతి గృహాలు, ట్రాఫిక్ నియంత్రణ, రాను పోను యాత్రికులకు మార్గ నిర్దేశాలను ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. అందుకు సంబంధించి ఇప్పటినుంచి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా రాజమహేంద్రవరం నగరాన్ని సుందరీకరణ నగరముగా తీర్చిదిద్దే విషయంలో రోడ్ల సుందరీకరణ, ట్రాఫిక్ కంట్రోల్, నీటి కొరత, కలవర్టు లు, పార్క్ నిర్మాణాలు, గోదావరి పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, బ్యూటిఫికేషన్ సంబంధించి సిటీ ప్లానెట్స్ ద్వారా ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *