విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించడమే కాదు, స్వతంత్ర అభ్యర్థులకు కష్టం నష్టం జరగకుండా చూసుకున్నప్పుడే దేశం బాగుపడుతుందని థర్డ్ ఫ్రంట్ అధ్యక్షులు దేవరపల్లి మహేష్ అన్నారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు ఎన్నికలలో ఎంపిగా పోటీచేసి, స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకోలేకపోయామన్నారు. పవిత్రమైన రాజ్యాంగ బద్ధ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, ఎన్‌టిఆర్ జిల్లా 12-విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలు, ఎపి 80-విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలని 2024 సార్వత్రిక ఎన్నికలు అపహాస్యం చేశాయన్నారు. ఈ రెండు నియోజకవర్గాలైనా విజయవాడ పార్లమెంటు విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు, విజయవాడ నగర డిప్యూటీ మేయర్‌లు, డివిజన్ కార్పొరేటర్లు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు గురై ఇండిపెండెంట్స్‌గా పోటీ చేసిన అభ్యర్థులకు నష్టం కలిగించడమే కాకుండా, నోటా పేరుని సైతం అధికారికంగా దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఎన్నికల అధికారి వారికి ఫిర్యాదు చేసినా ఎలక్షన్ కమిషన్ వారు శ్రద్ధ వహించకపోవడంతో సమస్యలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా సమస్య ఇన్ని రోజులు కొనసాగడం ముమ్మాటికి వారి తప్పిదమేనని అన్నారు. దీనివల్ల సమస్యలు పెరిగి వాటి రూపాలు మారిపోయే అవకాశం ఉందన్నారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …