Breaking News

అన్న క్యాంటీన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండండి…

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న క్యాంటీన్లను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 11 అన్న క్యాంటీన్లను నిరంతరం పర్యవేక్షించేందుకు ఏర్పాటుచేసిన 11 నోడల్ ఆఫీసర్లను, 11 పరిశీలన ఆఫీసుర్లు నిరంతరం పర్యవేక్షిస్తుండాలని, అన్న క్యాంటీన్లో వసతులు కానీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ ఎటువంటి సమస్యనా వెంటనే సంబంధిత శాఖలకు తెలియపరచాలని, సమస్యను తెలిపిన వెంటనే ఆ సమస్యను సంబంధిత శాఖధిపతులు 15 నిమిషాలలో పరిష్కరించాలని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ప్రతిరోజు ఉదయం పరిశీలన అధికారులు ఆహారం లో నాణ్యత, ఇస్తున్న టోకెన్లు, క్యాంటీన్లో ప్రజలకు కల్పించిన సదుపాయాలలో సమస్యలు ఏవైనా గమనించినచో వెంటనే తెలియపరచాలని అన్నారు.

హెచ్బి కాలనీ అన్న క్యాంటీన్,ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ అన్న క్యాంటీన్ కు నోడల్ ఆఫీసర్ గా సతీష్ కుమార్ డి. ఈ.ఈ , పరిశీలన అధికారులు వెల్ఫేర్ సెక్రెటరీలు రమ్యకృష్ణ, సురేష్, గాంధీజీ మహిళా కళాశాల అన్న క్యాంటీన్ కు నోడల్ ఆఫీసర్గా జి.ప్రసాద్ టిపిఎస్, పరిశీలన అధికారిగా అశోక రాణి వెల్ఫేర్ సెక్రెటరీ, ధర్నా చౌక్ అన్న క్యాంటీన్కు నోడల్ ఆఫీసర్గా డాక్టర్ రామకోటేశ్వరరావు అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, పరిశీలన అధికారిగా వెల్ఫేర్ సెక్రెటరీ, రామకృష్ణ పతంగి, బావజీపేట అన్న క్యాంటీన్ నోడల్ ఆఫీసర్ గా వి. శ్రీనివాస్ ఈ ఈ -2, కాసింబి షేక్ – వెల్ఫేర్ సెక్రెటరీ, అయోధ్య నగర్ అన్న క్యాంటీన్ కు ఎం జగదీష్ ఏ.సి. పి 2-నోడల్ ఆఫీసర్ గా,పరిశీలన అధికారిగా వెల్ఫేర్ సెక్రెటరీ రాంబాబు, సింగ్ నగర్ అన్న క్యాంటీన్ కు నోడల్ ఆఫీసర్గా సానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు, పరిశీలన అధికారిగా వెల్ఫేర్ సెక్రెటరీ బాబు ప్రభాకర్ రావు, ఏపీఎస్ఆర్ఎంసి హై స్కూల్ అన్న క్యాంటీన్ నోడల్ఆఫీసర్గా ఉమామహేశ్వరి, పరిశీలన అధికారిగా వెల్ఫేర్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, రాణి గారి తోట అన్న క్యాంటీన్ కు నోడల్ ఆఫీసర్గా డిప్యూటీ సిటీ ప్లానర్ జుబిన్, పరిశీలన అధికారిగా వెల్ఫేర్ సెక్రెటరీ పద్మాను, సాయిబాబా టెంపుల్, నేతాజీ బ్రిడ్జి వద్ద గల అన్న క్యాంటీన్ కు నోడల్ ఆఫీసర్గా ప్రవీణ్ చంద్ర డి.ఈ.ఈ, పరిశీలనాధికారిగా వెల్ఫేర్ సెక్రెటరీ జస్వంత్ ను, పటమట హై స్కూల్ వద్దగల అన్నా క్యాంటీన్ కు నోడల్ ఆఫీసర్గా సానిటరీ సూపర్వైజర్ సలీం అహ్మద్, పరిశీలన అధికారిగా వెల్ఫేర్ సెక్రెటరీ రాగిణి …నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతి అన్న క్యాంటీన్ నివేదికను ప్రతిపూట ఎనీ టోకెన్ లు ఇచ్చారు, ఆహారం ఎన్నింటికి క్యాంటీన్ వద్దకు వచ్చింది ఏ సమయం నుండి ప్రజలకు టోకెన్ల ద్వారా ఇస్తున్నారు, త్రాగునీరు, మరుగుదొడ్లు నిర్వహణ, హ్యాండ్ వాష్, సదుపాయాలు ఎలా ఉన్నాయి అని నిరంతరం పర్యవేక్షిస్తూ నివేదికను సమర్పిస్తూ ఉండాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *