Breaking News

వైసీపి హయాంలొ రైతులకు నష్టం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ అధారిటీ ( ఆత్మ)విభాగాన్ని వ్యవసాయశాఖకు అనుసంధానం చేయకుండా గత వైసీపి పాలన అరాచకంగా సాగిందని ఆత్మడిపార్టెమెంట్ ఉద్యోగులు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
2014 ఎన్డిఎ ప్రభుత్వంలో ఆత్మ డిపార్ట్ ఉద్యోగులు పనిచేశారని అయితే వైసీపి ప్రభుత్వంలో మాత్రం ఆవిధంగా వ్యవశాయ శాఖకు అనుసంధానం చేయక పోవడంతో కేంద్రం విడుదల చేసిన నిధులుతో పని చేసే వీలు లేకుండా ఉధ్యోగుల పట్ల అరాచకంగా వ్యవహరించిన వైసీపి వల్ల ప్రస్తుతం 550 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా 100 మంది మాత్రమే ఉన్నారని కర్నూలు జిల్లాకు చెందిన ఆర్ మారుతీ ఎస్వంత్ ఫిర్యాదు చేశారు. కావున ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. చర్యలు తీసుకోక పోతే రైతాంగానికి నష్టం చేకూరుతుందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
క్రుష్ణా జిల్లా పెనుమలూరు మండలం గంగూరు గ్రామానికి చెందిన యనమదల రాజకుమారిని ఫేక్ డాక్యుమెంట్ల తో లక్షల రూపాయాలు దండుకున్న దుర్గాదేవిని అరెస్టు చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. కానూరు పోలీస్ స్టేషన్ లో కేసు ఉన్నా దుర్గాదేవి పై కేసు ఉన్నా పోలీసులు ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించింది. వైసీపి నేత ప్రోధ్భలంతోనే దుర్గాదేవి తో పాటు కాకినాడ కు చెందిన గోవిందు, అప్పిరెడ్డి సోమిరెడ్డి తదితరులు ఇబ్రహీంపట్నంలో 1000 గజాలు స్థలం రిజిస్ట్రేషన్ చేస్తామని లక్షల రూపాయలు దండుకుని రిజిస్ట్రేషన్ చేయలేదు ఇదే విషయం ఆరాతీస్తే అక్కడ ఎటువంటి భూములు లేవని తెలిసి మోస పోయానని భావించాను అని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ విధంగా పలు ఫిర్యాదులు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వారధిలో ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేషనాయుడు, అధికార ప్రతినిధులు పూడి తిరుపతిరావు, పెద్దిరెడ్డి రవికిరణ్, వారధి కో ఆర్డినేటర్ కిలారు దిలీప్ పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *