Breaking News

సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి ప్రజల కు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో సుజనా ఫౌండేషన్ మరియు షేర్ ఇండియా ఫౌండేషన్, సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 16 న పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ప్రారంభించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభిస్తుంది. భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని ఆదివారం స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. హెల్త్ క్యాంపు ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో లభించే వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చి గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు, థైరాయిడ్, టిబి, గుండె సంబంధిత వ్యాధులకు చికిత్సలు అందజేస్తున్నారు. ఎన్ ఆర్ ఐ వైద్య కళాశాల వ్యవస్థాపక డైరెక్టర్ అక్కినేని హాస్పిటల్స్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అక్కినేనిమణి ఈ వైద్య శిబిరంలో మహిళలకు చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మణి మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి అత్యాధునిక టెక్నాలజీ ని అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలందరికీ క్వాలిటీతో కూడిన వైద్యాన్ని అందించడం శుభ పరిణామం అన్నారు. ముఖ్యంగా మహిళల కోసం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, నిర్వహిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అందించే వైద్య సేవలను సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్నామని మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి వైద్యం అందించాలనె లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని హెల్త్ క్యాంప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బొమ్మకంటి వెంకటరమణ తెలిపారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేస్తున్నామన్నారు రెండో విడత శిబిరాన్ని ఈనెల 24 నుంచి సెప్టెంబర్ 8 వ తేదీ వరకు చిట్టినగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో నిర్వహిస్తామని పశ్చిమ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *