అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సోదర సోదరి ప్రేమ అనుభవైక్యంతోనే అర్థమవుతుంది. అక్కచెల్లెమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుంది. విప్లవ కవి శ్రీ గద్దరన్న పాడినట్టు చెల్లెలు పాదం మీద పుట్టుమచ్చగానో.. అక్క నుదుటున తిలకంగానో అలంకృతమైనప్పుడే ఆ రుణం తీరుతుందేమో! అదే విధంగా అన్నదమ్ముల ఆప్యాయతకు ఎవరు వెలకట్టగలరు? వీరిని జీవితాంతం గుండెల్లో గుడికట్టి పూజించడం తప్ప! అటువంటి అనురాగానికి ప్రతీకైన రక్షా బంధన్ పండుగ శుభ తరుణాన సోదర సోదరీమణులందరికీ అనురాగపూర్వక శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ వేడుకను శ్రావణ పౌర్ణమినాడు ప్రేమైక మనస్సులతో భారతీయులతోపాటు దక్షిణ, తూర్పు ఆసియా దేశాలలో వైభవంగా జరుపుకొనే ఈ పండుగ జరుపుకోవడం సోదర సోదరీమణుల అనురాగానికి ప్రతీక. ఈ శ్రావణ పౌర్ణమి దేశవాసులందరికీ శుభాలు కలుగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి రక్షా బంధన్ శుభాకాంక్షలు అని ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటనలో తెలిపారు.
Tags amaravathi
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …