Breaking News

సీనియ‌ర్ నాయ‌కుడు పిడ‌ప‌ర్తి పిచ్చి రెడ్డి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ , ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్ర‌సాద్

రెడ్డి గూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
టిడిపి సీనియ‌ర్ నాయ‌కుడు పిడ‌ప‌ర్తి పిచ్చి రెడ్డి (70) కుటుంబాన్ని ఎంపి కేశినేని శివ‌నాథ్ , ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్ర‌సాద్ ప‌రామ‌ర్శించారు. ఓబులా పురం గ్రామానికి చెందిన పిడ‌ప‌ర్తి పిచ్చి రెడ్డి విష జ్వ‌రం బారిన ప‌డి గ‌త కొన్ని రోజులుగా మ‌ణిపాల్ హాస్ప‌టల్ లో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. సోమ‌వారం ఆయ‌న అంత్య‌క్రియ‌లు ఘ‌నంగా జ‌రిగాయి. టిడిపి ప్రారంభం నుంచి పార్టీ అభివృద్ది కోసం క్రియాశీల‌కంగా పనిచేసిన పిచ్చిరెడ్డి నివాసానికి విచ్చేసి…ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కి ఎంపి కేశినేని శివ‌నాథ్ , ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్ర‌సాద్ ప్రగాఢ సానుభూతి తెలియ‌ప‌ర్చారు. పిడ‌ప‌ర్తి పిచ్చి రెడ్డి పార్టీకి చేసిన సేవ‌లు గుర్తు చేసుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *