గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్యం అధిక ప్రాధాన్యత కల్గిన అంశమని, శానిటేషన్ విధుల్లో ఉన్న అధికారులు, కార్మికులు సమన్వయంతో కృషి చేస్తూ 15 రోజుల్లో మెరుగైన పారిశుధ్యాన్ని నగరానికి అందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ప్రజారోగ్య విభాగానికి సంబందించి శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులతో నగరంలో పారిశుధ్య నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్య రక్షణలో పారిశుధ్య విభాగం కీలకమన్నారు. అటువంటి ప్రజారోగ్య విభాగంలో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేయాలన్నారు. రానున్న 15 రోజుల్లో నగరంలో మెరుగైన పారిశుధ్యాన్ని సాధించాలని, ప్రతి రోజు ఉదయం 5:30 గంటల నుండి నగరంలో ఆకస్మిక తనిఖీలకు వస్తామన్నారు. పారిశుధ్య విభాగానికి సంబందించిన మేస్త్రీలు టాస్క్ ఫోర్స్ వంటి ఇతర విధుల్లో ఉండడానికి వీలులేదని, మంగళవారం నుండి వారికి సంబదించిన వార్డ్ ల్లోవిధుల్లో ఉండాలని ఆదేశించారు. గతంలో గుంటూరు నగరపాలక సంస్థలో కమిషనర్, అదనపు కమిషనర్ భాధ్యతలు చేపట్టి ఉన్నందున నగరంపై సమగ్ర అవగాహన ఉందని, విధుల్లో అంకిత భావంతో పని చేసే వారికి అండగా ఉంటానని, నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు తీసుకోవడంలో కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు. సచివాలయ కార్యదర్శులు జాబ్ చార్ట్ మేరకు విధులు నిర్వహించాలని, ప్రతి కార్యదర్శి తమ సచివాలయ పరిధిలో మెరుగైన పారిశుధ్యం సాధించడానికి కృషి చేయాలన్నారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్ డి.వెంకట ల్ లక్ష్మీ, శానిటరీ సూపర్వైజర్లు రాంబాబు, ఆనందకుమార్, ఆయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …