Breaking News

గుణదల ఇయస్‌ఐ హాస్పిటల్‌ను 300 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తాం…

-10 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తాం…
-రాష్ట్రంలోని ఇయస్‌ఐ హాస్పటల్స్‌కు పూర్వ వైభవం తీసుకొస్తా…
-గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఇయస్‌ఐ ఆసుపత్రులను నిర్వీర్యం చేసింది…
-వైయస్సార్‌ బీమా పేరుతో సొంత ఇన్సూరెన్స్‌ కంపెనీ ఏర్పాటు చేసి గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిరది..
-కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది…
-ఈ విషయమై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తాం…
-వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇయస్‌ఐ మెంబర్‌ షిప్‌ 25 లక్షలకు పెంచుతాం…
-రాష్ట్ర కార్మిక కర్మగారాలు బాయిలర్స్‌ అండ్‌ ఐయమ్‌ఎస్‌ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుణదల ఇయస్‌ఐ ఆసుపత్రిని 300 పడకుల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడంతో పాటు అన్ని మౌళిక సదుపాయాలు కల్పించుటకు ప్రణాళిక సిద్దం చేశామని రాష్ట్ర కార్మిక కర్మాగారాలు బాయిలర్స్‌ అండ్‌ ఐయమ్‌ఎస్‌ శాఖా మంత్రి శ్రీ వాసం శేట్టి సుభాష్‌ అన్నారు.

గుణదలలోని ఇయస్‌ఐ ఆసుపత్రి నూతన ప్రాంగణాన్ని సోమవారం మంత్రి వాసం శెట్టి సుభాష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1968లో ప్రారంభించి లక్షలాది కార్మిక కుటుంబాలకు వైద్య సేవలందిస్తూ ప్రస్తుతం 110 పడకలున్న ఈ ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలోని ఇయస్‌ఐ ఆసుపత్రిలన్నింటిని దశలవారిగా అభివృద్ధి చేయనున్నామన్నారు. ఇందు నిమిత్తం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. కార్మిక కుటుంబాలకు సత్వర వైద్య సేవలందే విధంగా ఇయస్‌ఐ ఆసుపత్రిలోని అన్ని రోగాలకు వైద్యం అందే విధంగా ఇయస్‌ఐ ఆసుపత్రులన్నిటిని అభివృద్ది చేస్తామన్నారు. గత 5 ఏళ్ళగా ఇయస్‌ఐ హాస్పటల్స్‌ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సరైన పరికరాలు లేకుండా ఉద్యోగ కాళీలను భర్తీ చేయికుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. వైఎస్‌ఆర్‌ భీమా పేరుతో సొంత ఇన్యూరెన్స్‌ కంపెనీ ఏర్పాటు చేసి అవకతవకలకు పాల్పడిరదని వీటిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించమన్నారు. కేంద్రం నుండి వచ్చిన నిధులన్నింటి గత ప్రభుత్వం పక్కదారికి మళ్ళించిందని కార్మిక శాఖను బ్రస్టు పట్టించిందని మంత్రి అన్నారు. 10 మంది కార్మికులున్న ప్రతి సంస్థను ఇయస్‌ఐ పరిధిలోకి తెస్తామని ఇయస్‌ఐ మొంబర్‌ షిప్‌ పెంచుతామని వచ్చే 5 సంవత్సరాల్లో 25 లక్షల మొంబర్‌ షిప్‌ పెంచే లక్ష్యంలో పనిచేస్తున్నామని మంత్రి వాసం శెట్టి సుభాష్‌ అన్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మెహన్‌రావు మాట్లాడుతూ వ్యవసాయం తరువాత ప్రాధాన్యతగల కార్మిక రంగాన్ని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమానికి నిధులు కేటాయిస్తాయి అని అన్నారు. గుణదల ఇయస్‌ఐ ఆసుపత్రిని కార్మిక కుటుంబానికి ఆరోగ్య భరోసా అందించే విధంగా తీర్చిదిద్దుతామని శాసనసభ్యులు గద్దె రామ్మెహన్‌రావు అన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్మిక కర్మగారాలు బాయిలర్స్‌ అండ్‌ ఐయమ్‌ఎస్‌ శాఖ ప్రభుత్వ కార్యదర్శి యంయం నాయక్‌, యంఎల్‌సి పి. ఆశోక్‌ బాబుకార్మిక రాజ్య భీమా వైద్య సేవల డైరెక్టర్‌ వి. ఆంజనేయులు, ఇయస్‌ఐసి ప్రాంతీయ సంచాలకులు ఎ. వేణుగోపాల్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *