-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, దేవేంద్ర రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిప్యూటీ క కలెక్టర్లు రామ్మోహన్, దేవేంద్ర రెడ్డి లు కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు :
రెవెన్యూ శాఖ – 67, పోలీస్ శాఖ- 3, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ – 5 , మున్సిపల్ కమిషనర్ –2, హౌసింగ్ -3, పబ్లిక్ హెల్త్ -2, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ -2, స్త్రీ శిశు సంక్షేమశాఖ -2, ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజక్ట్ – 1, ఏపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ – 1, నీటిపారుదల శాఖ – 1, రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ – 1, ఏపి టౌన్ షిప్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ -1, బీసీ సంక్షేమశాఖ – 1, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ – 1, గనులు భూగర్భ శాఖ -1, పంచాయతీ రాజ్ -1, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ -1, రూరల్ డెవలప్మెంట్ – 1, సమగ్ర శిక్ష -1, విద్యా శాఖ -1
వెరసి మొత్తం 101 వినతులు రావడం జరిగిందని అధికారులు అందరు సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన అధికారులకు వారు సూచించారు.