విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 22వ తేదీన అనగా గురువారం జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్ మేళా ప్రభుత్వ ఐటిఐ కాలేజి ఆవరణలో జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మినీ బాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు ఒక ప్రకటన లో తెలియజేశారు. ఈ జాబ్ మేళా ను ఉమ్మడి కృష్ణ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఈ మిని బాబ్ మేళాలో జీనియస్, ఎస్ఐఎస్ లిమిటెడ్, డిమార్ట్, ప్లప్ కార్ట్, విజేత, హాయ్ బ్లూ మొడ్యూలేటర్ తదితర కంపెనీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. కావున జిల్లాలోని పదవ తరగతి ఐటిఐ డిప్లమా మరియు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు నిరుద్యోగుల పూర్తి బయోడేటా ధృవ పత్రాలు జిరాక్స్ కాపీలు ఆధార్ కార్డుతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు 12 వేల నుండి 20వేల వరకు వేతనం లభిస్తుందని తెలియజేశారు. ఆసక్తి గల అభ్యర్థులు www.ncs.gov.in వెబ్ సైట్లో వివరములు నమోదు చేసుకోగలరని తెలిపారు. ఇతర వివరములకు 8142416211 (వాట్సప్ కాల్ మాత్రమే)నెంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …