గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పేదవాని ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని, అందులో భాగంగా గుంటూరు నగర రేట్ పేయర్స్ అసోసియేషన్ విరాళం అందించడం అభినందనీయమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు అన్నారు. బుధవారం నగరపాలక సంస్థలోని కమిషనర్ చాంబర్ లో కమిషనర్ కి రేట్ పేయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.25 వేల విరాళం చెక్ ని అందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు విరాళం ఇచ్చే ప్రతి రూపాయి ఎంతో మంది పేదవారి ఆకలి తీర్చేందుకు దోహద పడుతుందన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు తమ వంతుగా ముందుకు వచ్చి విరాళం అందించిన రేట్ పేయర్స్ అసోసియేషన్ కు నగరపాలక సంస్థ తరుపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు.
రేట్ పేయర్స్ అసోసియేషన్ నగర అధ్యక్షులు నారాయణరెడ్డి మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించగానే తమ వంతుగా నగర కమిషనర్ స్పందించి జీతం నుండి విరాళం అందించారని, తన స్పూర్తితో తమ అసోసియేషన్ నుండి కూడా రూ.25 వేలు విరాళం అందించామన్నారు. పేదల కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని కోరారు.
కార్యక్రమంలో గుంటూరు నగర రేట్ పేయర్స్ అసోసియేషన్ ఈసి మెంబర్ సదాశివరావు, ట్రెజరర్ సాయిరాం, సభ్యులు కృష్ణారావు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …