గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2025 ఓటర్ల జాబితాకి సంబందించి డోర్ టు డోర్ సర్వేను బిఎల్ఓలు వేగంగా, ప్రణాళికాబద్దంగా చేపట్టాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బిఎల్ఓలకు స్పష్టం చేశారు. నగరంలో ఇంటింటి ఓటర్ సర్వే వేగవంతం పై బుధవారం స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సూపర్వైజరి అధికారులు, బిఎల్ఓలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగరంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2025 ఓటర్ల జాబితాకి సంబందించి డోర్ టు డోర్ సర్వేలో వేగం పెరగాలని, బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓట్ల సర్వే చేయాలన్నారు. సర్వేలో భాగంగా ప్రతి బిఎల్ఓ తమ పరిధిలోని ఓటర్ల లిస్ట్ పక్కాగా, సమగ్ర వివరాలతో ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రధానంగా చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్ల కరెక్షన్స్ ని ఈ సర్వే సమయంలోనే పూర్తి చేసుకోవాలన్నారు. ఓటర్ల లిస్టు స్వచ్చంగా ఉంటే ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందన్నారు. సూపర్వైజరి అధికారులు ప్రతి రోజు వారి పరిధిలో కొన్ని ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి సర్వేలో పాల్గొనాలన్నారు. సర్వేలో అందే ఫారాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చేయాలని అందుకు తగిన విధంగా అవసరమైన సిబ్బందిని సిద్దంగా ఉంచాలన్నారు. బిఎల్ఓలకు యాప్, లేదా ఫారాల దరఖాస్తు పై ఎటువంటి అనుమానాలు, సందేహాలు వచ్చినా సంప్రదించడానికి ఎన్నికల విభాగంలో సిబ్బందిని కేటాయించుకోవాలని, బదిలీలు, ఇతర కారణాలతో ఖాళీ అయిన బిఎల్ఓల స్థానంలో వెంటనే మరో కార్యదర్శికి విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఎన్నికల విభాగ సూపరిండెంట్ ని ఆదేశించారు. సర్వేలో వెనుకబడిన బిఎల్ఓలతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారి పై చర్యలుకు సిఫార్స్ చేయాలని సూపర్వైజరి అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, డి.వెంకట లక్ష్మీ, మేనేజర్ ప్రసాద్, ఎన్నికల సూపరిండెంట్ పద్మ, తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …