-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రోడ్లు మరియు భవనాలకు సంబంధించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టర్ లోని సమావేశ మందిరం నందు రోడ్లు మరియు భవనాల శాఖ అభివృద్ధి పనులపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని రోడ్లు మరియు భవనాలకు సంబంధించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ల నిర్మాణం, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లు, ఎంపీ లాండ్స్ ఫండ్స్, ఎన్ డి బి, నాబార్డ్, తుడ తదితర అభివృద్ధి పనులను లక్ష్యం మేరకు వేగవంతం చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ఇంకా పూర్తి కానీ పనులను పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్ అండ్ బి అధికారి మధుసూదన్ రావు, డివిజన్ స్థాయి ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.