-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలను ఎటువంటి లోపం లేకుండా తీసుకోవాలని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న భద్రతా చర్యలకు తానే స్వయంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఇంజనీరింగ్ శాఖ వారు ఆమోదం కోసం ప్రతిపాదించిన అంశాలను ఫీల్డ్ విజిట్ చేసి పరిశీలించారు. అందులో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ భద్రత చర్యల్లో భాగంగా వేముల శ్యామల దేవి వారి రోడ్డు, విశాలాంధ్ర రోడ్డు, ఏఎస్ రామారావు రోడ్డు, సింగనగర్ శాంతినగర్, ఎక్సెల్ ప్లాంట్, వాంబే కాలనీ మరియు పైపులు రోడ్డు ప్రాంతాలలో రోడ్ లో ఇంజనీరింగ్ శాఖ వారు ప్రతిపాదించిన అంశాలపై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్వయంగా ఫీల్డ్ లో పరిశీలించారు. ప్రజలకు భద్రత కల్పించే విషయంలో ఎటువంటి లోటుపట్లు లేకుండా చూసుకోవాలని, తనే స్వయంగా ప్రాంతాలన్నీ వీక్షించి అధికారులకు సూచనలు చేశారు. అందులో భాగంగా 23వ డివిజన్లోని దాసరి వారి వీధిలో కొత్త రోడ్డు ప్రతిపాదనకు కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. పాత రాజీవ్ నగర్ లోని పాత కమ్యూనిటీ హాల్ పరిశీలించారు. ఆ కమ్యూనిటీ హాల్ను పడగొట్టకు ఇంజనీరింగ్ శాఖ వారు ప్రతిపాదించగా, ఇంజనీరింగ్ సిబ్బంది ప్రతిపాదనను క్షేత్రస్థాయిలో పరిశీలించి, స్టెబిలిటీ ఉందా లేదా అని చూసి పడగొట్టుటకు ఆదేశాలు ఇచ్చి, డిమాలిష్ చేసిన తర్వాత పరిసరాలు మొత్తం పరిశుభ్రంగా ఉంచుతూ పార్క్ ను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ఐకానిక్ పార్క్ ను సందర్శించి పరిశీలించారు పూర్తి స్థాయి వివరాలతో ఐకానిక్ పార్క్ కు సంబంధించిన నివేదికను ఇవ్వమని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర తో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి. శ్రీనివాస్, డీ. ఈ లు, ఎ. ఈ లు పాల్గొన్నారు.