అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో జాతీయ భావజాలంతో కార్యకర్తలు పనిచేసే ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనని అందువల్లనే దేశ వ్యాప్తంగా బిజెపి ప్రతి ఎన్నికలో బలపడుతూ వస్తున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి అనుబంద మోర్చాల అధ్యక్ష కార్యదర్శులు, పదాదికారుల సమావేశంలో అధ్యక్షత వహించి పురందేశ్వరి ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఎపిలో భవిష్యత్ లో కూడా లేవ లేని పరిస్ధితికి వెళ్లిపోయిందని కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ప్రజలకు బిజెపి కార్యకర్తలు చేసిన సహకారం ప్రజలు ఎవ్వరూమరిచి పోలేరన్నారు. బిజెపి కార్యకర్తలకు ఉన్న సేవాగుణం మరెక్కడా లేదన్నారు. బిజెపి కార్యకర్తలు గతంలో సభ్యత్వ నమోదును భాద్యతగా తీసుకుని పని చేస్తే 18 కోట్ల మందిని సభ్యులు చేరిస్తే అప్పటికీ ప్రపంచంలో చైనా కమ్యునిస్టు పార్టీ 9 కోట్లు సభ్యత్వాన్ని అధికమించి ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిందన్నారు. దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బిజెపి, మిత్రపక్షాలతో అధికారంలో ఉన్నామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనేక సంస్కరణలు తీసుకువచ్చిన విషయాన్ని వివరిస్తూ ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి సభ్యత్వ నమోదులో మోర్చాలు కీలకం కావలన్నారు. సమావేశంలో ఎపి బిజెపి సభ్యత్వ ఇంచార్జి అరవింద్ మీనన్ తెలుగులో ప్రసంగిస్తూ కార్యకర్తలు క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. సభ్యత్వ నమోదులో మోర్చాలు కీలకంగా ఉండాలని పార్టీకి మోర్చాలు గ్రాస్ రూట్ లెవెల్లొ పనిచేయాలన్నారు.
యుపి మాజీ మంత్రి, ప్రయాగ రాజ్ ఎమ్మెల్యే సిద్దార్ధనాద్ సింగ్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్రంలో బలపడిందని ఆదిశగానే సభ్యత్వం పెంచుకోవలసిన అవసరం ఉందన్నారు. బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ సభ్యత్వనమోదు విషయంలో మోర్చా నేతలకు మార్గనిర్ధేశం చేశారు. కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, ఆధోని ఎమ్మెల్యే పార్ధసారధి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సభ్యత్వ ఇంఛార్జి దయాకర్ రెడ్డి తదితరులు వేదికను అలంకరించారు.