విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలో ని నిరుద్యోగులు గిరిజన యువత అయ్యిన (బి. ఇ డి – డి. ఇ డి) B.Ed-D.Ed. కోర్సులు మరియు టెట్ ( TET) పాస్ పాసైన గిరిజన కలానికి చెందిన నిరుద్యోగ యువత కు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అర్హతలు కలిగిన వారికి ఉచితంగా డి ఎస్ సి పై కోచింగ్ ఇవ్వడంతో పాటుగా వసతి,భోజన సౌకర్యం కలిగించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సుజనా ఒక ప్రకటన లో తెలిపారు.
ఉచిత డి ఎస్ సి కోచింగ్ కు అర్హతలు:
అభ్యర్థులు డిగ్రీ మరియు బి ఈ డి( B.Ed) – ఇంటర్ + డి ఈ డి (D.Ed.) మరియు టెట్ (TET) యందు పాస్ అయ్యిన వారి మార్కుల ప్రకారంగా మెరిట్ జాబితా ఆధారంగా (లేదా) ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయబడతారు. మహిళలకు 33 1/3 శాతము రిజర్వేషను ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
కావున బి. ఈ డి – డి. ఈడీ (B.Ed-D.Ed.) మరియు టెట్ ( TET) కోర్సులలో పాస్ అయ్యిన నిరుద్యోగ గిరిజన యువతీ యువకులు వారి పూర్తి బయోడేటాతో పాటు వారి విద్యార్హత, కులదృవీకరణ పత్రము, రేషను కార్డు , ఆధారు కార్డు, పాసుపోర్డు సైజు కలర్ ఫోటోతో పాటు బి.ఈ డి-డి ఈ డి ( B.Ed./D.Ed.) మరియు TET కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన ధృవీకరణ పత్రము మరియు ఇతర సంబంధిత ధృవీకరణ పత్రము నకలులను గెజిటేట్ అధికారి వారచే ధృవీకరించి అట్టేస్తాషన్ (Attestation) అభ్యర్థుల బయోడేటాకు జతపరచి, పూర్తి చేసిన దరఖాస్తులను, జిల్లా గిరిజన సంక్షేమ మరియ సాధికారత అధికారి కార్యాలయం, డోర్ నెంబర్ 49-9-10-1 విష్ణు నగర్ గుణదల ఏలూరు రోడ్ సదరన్ పవర్ ఆఫీస్ పక్కన, విజయవాడ 4. కార్యాలయంలో దరఖాస్తులను ఈనెల 25వ తేదీలోగా అందజేయవలసి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు మొబైల్ నెంబర్ 96663 92500ను సంప్రదించవచ్చునని జిల్లా కలెక్టర్ జి సృజన ఆ ప్రకటనలో తెలిపారు.