Breaking News

ఎస్‌కెసివి అనాధ బాలల ఆశ్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన వేడుకలు

-విరాళం అందజేసిన ఎన్‌ఆర్‌ఐ గొలగాని రవికృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పద్మ విభూషణ్‌ మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన వేడుకలను విజయవాడ నగరంలోని అనాధ వీధి బాలలకు సేవలందిస్తున్న ఎస్‌కెసివి చిల్డ్రన్స్‌ ట్రస్ట్‌ షెల్టర్‌ హోమ్‌ గాంధీనగర్‌లో అనాధ పిల్లల సమక్షంలో రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఎన్నారై గొలగాని చారిటబుల్‌ ట్రస్ట్‌ (జిసిటి) చైర్మన్‌ గొలగాని రవికృష్ణ నిర్వహించారు. అనాధ వీధి బాలల కోసం మూడు ఆశ్రమ వసతి గృహాలు నిర్వహిస్తూ విశేష కృషి చేస్తున్న ఎస్‌కెసివి చిల్డ్రన్స్‌ ట్రస్ట్‌ వారికి చిరంజీవి జన్మదిన సందర్భంగా చిరంజీవి పేరు మీద లైఫ్‌ టైమ్‌ డోనర్‌గా 50,000 రూపాయల విరాళంను గొలగాని చారిటబుల్‌ ట్రస్ట్‌ (జిసిటి) ద్వారా అందించారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమా చేతుల మీదుగా, రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు ఎస్‌కెసివి పిల్లల ఆశ్రమ ప్రతినిధులకు విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అఖిలభారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు లకనం శ్యాంప్రసాద్‌ మాట్లాడుతూ మెగా అభిమాన సోదరుడు ఎన్‌ఆర్‌ఐ గొలగాని రవికృష్ణ ప్రతి సంవత్సరం మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన సందర్భంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారని, ఎస్‌కెసివి అనాధ పిల్లల ట్రస్ట్‌కు చిరంజీవి పేరు మీద లైఫ్‌ టైం డోనర్‌గా విరాళం ఇవ్వడం ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు. ఈ సందర్భంగా ఎస్‌కెసివి ట్రస్ట్‌ ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో కూడా గొలగాని రవికృష్ణ ఎస్‌కెసివి ట్రస్ట్‌కు జనసేనాని అని పవన్‌కళ్యాణ్‌ జన్మదిన సందర్భంగా 10 వేలు నగదు విరాళం ఇచ్చారు అని, ఇప్పుడు చిరంజీవి పేరు మీద లైఫ్‌ టైం డోనర్‌గా విరాళం ఇవ్వడం ఎంతో సంతోషకరమని, వారి కోరిక మేరకు ప్రతి సంవత్సరం చిరంజీవి Ê పవన్‌కళ్యాణ్‌ జన్మదిన రోజులలో వారి ఆశ్రమంలోని అనాధ బాలలకు అన్నదానం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత నాయకులు సోడిశెట్టి కృష్ణ ప్రసాద్‌, ఇల్లూరి సుగుణబాబు, జనసేన నాయకులు బొలిశెట్టి వంశీకృష్ణ, కటిక రాకేష్‌నాథ్‌, కలిశెట్టి భాస్కర్‌, పటమట శేఖర్‌, కాళ్ళ ఆదినారాయణ, వంశీధర్‌, మారాసు రమణ, యుగంధర్‌ రెడ్డి తదితర మెగా అభిమానులు, జన సైనికులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *