-కలెక్టర్ మరియు జిల్లా డివిఎంసి కమిటీ చైర్మన్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ ల సమస్యల పరిష్కారం కొరకు వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా, ఆర్థిక సామాజిక భద్రత, న్యాయం అందేందుకు ఈ సమావేశాలకు వేదిక ఈ డివిఎంసి కమిటీ సమావేశం అని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, ఎమ్మెల్యే లు కోనేటి ఆదిమూలం, కోరుగొండ్ల రామకృష్ణ, నెలవల విజయశ్రీ, ఎస్పీ సుబ్బరాయుడు, కమిటీ సభ్యులు మరియు సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ల సమస్యల పరిష్కారం కొరకు, వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా, ఆర్థిక సామాజిక భద్రత, న్యాయం అందేందుకు ఈ సమావేశాలకు వేదిక ఈ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అని తెలిపారు. జిల్లాలో సివిల్ రైట్స్ డే ప్రతి నెల చివరి రోజున తప్పనిసరిగా మండలాల్లో జరపాలని సూచించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలకు ప్రభుత్వ పథకాలు, న్యాయపరమైన అంశాలు ప్రాధాన్యతగా అందేలా చూడాలనీ తెలిపారని అన్నారు. స్మశాన వాటికలు లేని గ్రామాలలో స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు.
ఎంఎల్సి మాట్లాడుతూ సదరు సమావేశానికి ప్రతి అధికారి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని, మండలాల్లో అంబేద్కర్ భవనాలు మంజూరు అయిన వాటి వివరాలు సభ్యులకు అందించాలని కోరారు. డివిజన్ లలో, మండలాల్లో జరిపే విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణకు సంబంధించి జిల్లా కమిటీ సభ్యులకు సమాచారం అందించాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాలను కూల్చి వేసి వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే ఆది మూలం మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కేసులపై పోలీసులు వాస్తవ పరిస్థితులను తెలుసుకుని మాత్రమే కేసు నమోదు చేయాలని, రాజకీయ కక్షలు, వ్యక్తిగత కక్షలతో ఇవి జరగరాదని కోరారు. సభ్యులు సూచిస్తూ బ్యాంకులలో ఎస్సీ ఎస్టీ లకు వ్యక్తిగత రుణాలు మంజూరు, ఎంఎస్ఎంఈ తదితర రుణాలను అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశ ప్రారంభానికి ముందు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యల నివేదికపై చర్చించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, కన్వీనర్ జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, డివిఎంసి సభ్యులు రాపూరి ప్రసాద్ బాబు, ఎన్వీ రమణయ్య, కెవి రమణ ప్రగతి ఎన్జీఓ, వెంకటాచలం, ఆర్డీఓ లు, జిల్లా అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.