Breaking News

సఫాయి కరంచారీల సేవలు అమూల్యమైనవి… వెల కట్టలేనివి.. వారిని గౌరవ ప్రదంగా చూడాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సఫాయి కరంచారీల సేవలు అమూల్యమైనవనీ, వెల కట్టలేనివనీ, వారిని గౌరవ ప్రదంగా చూడాలనీ, వారికి సంబంధించిన పథకాలు వారికి సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా మాన్యువల్ స్కావెంజర్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ సుబ్బరాయుడు తో కలిసి నిర్వహించారు. సఫాయి కరంచారీల సేవలు అమూల్యమైనవనీ, వెల కట్టలేనివనీ, వారిని గౌరవ ప్రదంగా చూడాలనీ, వారికి సంబంధించిన పథకాలు వారికి సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య మాట్లాడుతూ గతంలో నేషనల్ సఫారీ కరంచారి కమిషన్ చైర్మన్, జాతీయ సఫాయి కరంచారి సభ్యులు జిల్లాను సందర్శించి సమీక్ష నిర్వహించారని తెలిపారు. తిరుపతి పట్టణం నందు మాన్ హోల్ శుభ్రపరిచే క్రమంలో చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం అందించడం జరిగిందని తెలిపారు. మ్యాన్యువల్ స్కావెంజర్ ఇన్ ఇన్ శానిటరీ స్కేవెంజింగ్ పనులలో చేస్తున్నారా అని సర్వే అన్ని మండలాల ఎంపిడిఓ ల ద్వారా చేపట్టగా అలాంటి వారు ఎవరు లేరు అని నివేదిక ఇచ్చిన నేపథ్యంలో పత్రిక ప్రకటన ద్వారా ఎవరైనా ఇలాంటి ఇన్ శానిటరీ స్కేవెంజింగ్ పనులలో ఉన్నారా అనేది తెలుపమని ఇచ్చామని వివరించారు. చంద్రశేఖర్, ప్రభాకర్ రావు సభ్యులు వివరిస్తూ థియేటర్లలో, రైల్వేలలో మున్సిపల్ పరిధిలో సఫాయి కరంచారి పనులు చేపట్టే వారికి సరియైన యూనిఫామ్, మహిళలు దుస్తులు మార్చుకునే ఏర్పాటు అంశాలపై సదుపాయాలు కల్పించాలని, వాటిపై దృష్టి సారించాలని కోరారు. మున్సిపల్ పరిధిలో గ్లోవ్స్, షూ యూనిఫామ్ తదితర అంశాలు కార్మికులకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పథకాలైన ఎన్ఎస్కేఎఫ్డిసి సబ్సిడీ లోన్లను అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, అదనపు ఎస్పీలు వెంకట్రావు, రాజేంద్ర, ఎల్డిఎం విశ్వనాథ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *