Breaking News

ఎలెక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 ను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలి

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 కొరకు బిఎల్ఓ లు వారి పరిధిలోని ఇంటింటి గృహ సందర్శన చేసి ఓటర్ వెరిఫికేషన్ చేయాలని సిఈఓ కార్యాలయం నుండి అన్ని జిల్లాల డిఆర్ ఓ లు, ఈ ఆర్ ఓ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి మార్గదర్శనం చేశారు. గురువారం ఉదయం వెలగపుడి సచివాలయం నుండి అన్ని జిల్లాల డిఆర్ఓ, ఈఆర్ ఓలతో ఎస్ఎస్ఆర్ – 2025 పై, క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పై తదితర అంశాలపై వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారేపు రెడ్డి మౌర్య, డి.ఆర్.ఓ పెంచల కిషోర్, ఈ ఆర్ ఓ లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్బంగా ట్రైనింగ్ అధికారి మాట్లాడుతూ బిఎల్ఓ లు ఇంటి ఇంటికీ వెళ్లి గృహ సందర్శన చేసి ఓటర్ల జాబితా పరిశీలించి సదరు వివరాలను ధృవీకరణ చేయాలని జిల్లా డిఆర్ఓ, ఈఆర్ఓ లు, ఎఈఆర్ఓ లకు సక్రమంగా షెడ్యుల్ మేరకు నాణ్యతగా జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎలెక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ -2025 లో భాగంగా మార్గదర్శకాల మేరకు పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్తీకరణ / పునర్విభజన చేయాలని, ఎన్నికల జాబితా/ ఎపిక్ లో ఏదైనా లోపాలను తొలగించాలని, చిత్ర నాణ్యత మెరుగుపరచడం మరియు పోలింగ్ స్టేషన్ల మరియు సరిహద్దుల ఖారారు వంటి ప్రాథమిక సవరణ కార్యచరణలు చేపట్టాలని తెలిపారు. హెల్ప్ లైన్ యాప్ గురించి వివరించాలని తెలిపారు. అక్టోబర్ నెల 19 వ తేదీ నుండి 28 అక్టోబర్ వరకు ఫార్మాట్ 1 నుండి 8 వరకు 01.01.2025 నాటికి సంబంధించిన డ్రాఫ్ట్ ఎలెక్టోరల్ రోల్ తయారీ చేయాలని, అలాగే ముసాయిదా ఓటరు జాబితా 29 అక్టోబర్ 2024 నాటికి ప్రచురించాల్సి ఉంటుందని, తప్పులు లేని ఓటరు జాబితాను సిద్దం చేయాలని, అలాగే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే వాటిని 29 అక్టోబర్ 2024 నుండి 28 నవంబర్ 2024 వరకు ఫైల్ చేయవచ్చునని తెలిపారు. షెడ్యుల్ మేరకు నిర్దేశించబడిన ఎస్ ఎస్ ఆర్ 2025 ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఆ మేరకు చర్యలు చేపడతామని డిఆర్ఓ గారు వారికి వివరించారు. నిరాశ్రయులకు వారు ఉండే ల్యాండ్ మార్క్ ఆధారంగా చిరునామాను నోషనల్ గా నమోదు చేయాలని తెలిపారు. ఈఆర్ఓ లు సంబందిత బిఎల్ ఓ లకు ఓటర్ల జాబితా నమోదు మరియు సవరణ పై పూర్తి శిక్షణ ఇవ్వాలని అలాగే ఇంటిలో ఉన్న ప్రతి ఓటుహక్కు కలిగిన వ్యక్తిని వెరిఫికేషన్ చేస్తేనే ఆ ఇల్లు పూర్తిగా వెరిఫికేషన్ చేసినట్టు అవుతుందని, ఆ విధంగా బిఎల్ఓ లు వెరిఫికేషన్ చేసేలా సంబందిత అధికారులు వారికి సూచించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఈ ఆర్ ఓ లు కోదండరామి రెడ్డి, నిశాంత్ రెడ్డి, కిరణ్ కుమార్, శ్రీకాళహస్తి ఆర్.డి.ఓ రవి శంకర్ రెడ్డి, ఎస్డిసి రామ్ మోహన్, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *