Breaking News

ఉర్దూ భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి

-రాష్ట్ర మైనార్టీ వ్యవహారాలు మరియు న్యాయశాఖామంత్రి ఎన్ఎండీ ఫరూఖ్
-‘ఉర్దూ బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాల రూపకల్పన వర్క్ షాపు సందర్శించిన మంత్రి
-సమగ్ర శిక్ష అధికారులను అభినందించిన రాష్ట్ర మైనార్టీ వ్యవహారాలు మరియు న్యాయశాఖామంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల స్థాయి నుంచే ఉర్దూ భాషకు ప్రాధాన్యం ఇస్తూ భాషాభివృద్ధికి సమగ్ర శిక్ష చేస్తున్న కృషి అభినందనీయమని, ఉర్దూ పాఠ్య పుస్తకాలు బైలింగువల్ లో అందించడం అభినందనీయమని రాష్ట్ర మైనార్టీ వ్యవహారాలు మరియు న్యాయశాఖామంత్రి ఎన్ఎండీ ఫరూఖ్  అన్నారు.
పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీ ప్రాంగణం ఎస్-జే కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ‘ఉర్దూ బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాల రూపకల్పన 6 రోజుల కార్యశాల’కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూలేని విధంగా 1997లో ఉర్దూ మీడియంలో స్పెషల్ డిఎస్సీ నిర్వహించిన ఘనత నారా చంద్రబాబునాయుడు దని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఉర్దూ మాట్లాడేవారు ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోయారని, ఉర్దూ భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. ఈ కార్యశాలలో భాగంగా ఏర్పాటు చేసిన టీఎల్ఎంలు పరిశీలించి, భాషా నిపుణులను అభినందించారు.
అనంతరం కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి  మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పాఠశాలల్లో ఉర్దూ మాధ్యమ బోధన, పాఠశాలల నిర్వహణ , ఉపాధ్యాయుల నియామకం తదితర అంశాలను వివరించారు.
తర్వాత టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు టి.డి. జనార్దన్ మాట్లాడుతూ ప్రపంచాన్ని జయించడానికి, జాతీయాభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు నిరంతరం కృషి చేయాలని అన్నారు. విద్యార్థులకు త్వరగా చదువు బోధపడాలంటే మాతృభాషతోనే సాధ్యమవుతుందని అన్నారు. మాతృభాషను గత ప్రభుత్వం ప్రోత్సహించలేదని అన్నారు. తెలుగుదేశం పాలనలోకి వచ్చిన తర్వాత ఉర్దూను రెండో భాషగా గుర్తించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా హైదరాబాదులో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్శిటీ తెదేపా పార్టీ హయాంలో నిర్మించారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ‘సమగ్ర శిక్ష అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.కె.అన్నపూర్ణ, మైనార్టీ హక్కుల పోరాట సమితి నాయకులు ఫారూఖ్ షిబ్లీ, డా అబ్దుల్ హఖ్ యూనివర్శిటీ మాజీ ఉపకులపతి డా. ముజాఫర్ అలీ, సమగ్ర శిక్షా సిబ్బమంది అబ్దుల్ గని, పి.గీత, పి.వనజ, మల్లికార్జునరావు, ప్రసాదరావు, వివిధ ఉర్దూ ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *