విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యాటరీ రంగంలో అత్యంత పేరు ప్రతిష్టలు వున్న ఎక్సైడ్ బ్యాటరీ నూతన షాప్ సింగ్‌నగర్, డాబాకొట్లు సెంటర్, ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన ‘కలాం బ్యాటరీ వర్క్స్’ ఎక్సైడ్ కేర్ నూతన షాప్ ప్రారంభించబడిరది. గురువారం ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులు అబ్దుల్ కలాంను అభినందించి శుభాకాంక్షలు తెలిపి మరిన్ని నూతన బ్రాంచీలు ప్రారంభించి విస్తరించాలని ఆకాంక్షించారు. అనంతరం ౖ‘కలాం బ్యాటరీ వర్క్స్’ నిర్వాహకులు అబ్దుల్ కలాం మాట్లాడుతూ ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రావడం ఆనందంగా వుందన్నారు. ఈ బ్యాటరీరంగంలో ఎన్నో సంవత్సరాల నుండి వ్యాపారం నిర్వహిస్తున్నానని ఇది తమ 3వ బ్రాంచి అని తెలిపారు. ఈ రంగంలో ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి కస్టమర్ దేవుళ్ళకు సేవలు అందించాలని ఆకాంక్షతో లాభాపేక్ష ఆశించకుండా కొనసాగిస్తున్నామన్నారు. దీనికి కస్టమర్ల సహకారం కూడా కావాలని కోరారు. తమ బ్రాంచ్‌లో సేల్స్‌తోపాటు సర్వీస్ సౌకర్యాన్ని కూడా అందచేస్తున్నామన్నారు. కస్టమర్లకు బ్యాటరీ గ్యారంటీ విషయం గాని, రేటు విషయంలో గాని తేడా లేకుండా మిగతా బ్యాటరీ కంపెనీల పొటీని తట్టుకుని ఇన్ని సంవత్సరాలు ఈ రంగంలో కొనసాగుతున్నామంటే కేవలం కస్టమర్లకు మామీద వున్న నమ్మకమే కారణమన్నారు. తమ అభివృద్ధికి ప్రోత్సహిస్తున్న కంపెనీ వారికి, కస్టమర్ దేవుళ్ళకు, మిత్రులకు, శ్రేయేభిలాషులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని ప్రాంతాలలో బ్రాంచీలు ప్రారంభించే ఆలోచన వున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు, సిబ్బంది, కస్టమర్స్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …