Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణరెడ్డి

-సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి వర్గాన్ని, ప్రజలను చల్లగా ఆశీర్వదించమని కోరుకున్నా: మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి వర్గ సహచరులను, రాష్ట్ర ప్రజలను చల్లగా ఆశీర్వదించి ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి సుఖశాంతులతో వర్ధిల్లేలా ఆశీర్వదించమని కోరుకున్నానని పేర్కొన్నారు. గురువారం ఉదయం ప్రాతః కాల సమయంలో ప్రముఖ సినీ హీరో చిరంజీవి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కుటుంబ సమేతంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుని సేవించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న వీరికి రంగనాయక మండపంలో ఆలయ మర్యాదలతో అర్చకులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి వర్గ సహచరులను, రాష్ట్ర ప్రజలను చల్లగా ఆశీర్వదించి ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి సుఖశాంతులతో వర్ధిల్లేలా ఆశీర్వదించమని కోరుకున్నానని, రాష్ట్రం సుభిక్షంగా,సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్నానని కోరుకున్నాను అని తెలిపారు. మంత్రి వెంట తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఆనం కైవల్యారెడ్డి తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *