-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలంలో వర్షపు నీటి నిలువల వల్ల పెరుగుతున్న దోమల లార్వాలను అరికట్టేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమమే ఫ్రైడే -డ్రై డే అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 64 డివిజన్లోనూ ప్రజలకు దోమల వల్ల కలుగు మలేరియా, చికెన్ గునియా, డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా శుక్రవారం ఉదయం ఫ్రైడే- డ్రైడే కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.
శుక్రవారం జరిగిన ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగర పరిధిలో ఉన్న 64 డివిజన్లలో హెల్త్ సెక్రటరీలు ప్రతి ఇంటికి వెళ్లి నిల్వ ఉన్న నీళ్ల వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడమే కాకుండా వాటిని పాడవేసి వాటి వల్ల కలుగు వ్యాధుల గురించి చెప్పి ప్రజలకు అవగాహన కల్పించి పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. నెహ్రు నగర్, కొత్తపేట, వించిపేట తదితర ప్రాంతాలలో ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ మైకు ద్వారా అనౌన్స్మెంట్లు ఇచ్చుకుంటూ ప్రతి శుక్రవారం ప్రతి ఇంటిలో ఉన్న నీటి నిల్వలు ఉండే అవకాశం ఉన్న కొబ్బరి బోండాలు, రుబ్బురోలు, కూలర్లు, పూల కుండీలు, తొట్టులు ఇలాంటివి ప్రతి శుక్రవారం శుభ్రపరచుకోవాలని, అలా చేయడం వలన దోమలు లార్వా పెట్టే అవకాశం ఉండదని, తద్వారా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని అవగాహన కల్పించారు.
ఇలా ఫ్రైడే- డ్రై డే నిర్వహించడమే కాకుండా ప్రతి డివిజన్లో యాంటీ లార్వే ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని కలవట్లలో, వీధుల్లో ఫాగింగ్లు చేసుకుంటూ కాలువలో, మేజర్ అవుట్ఫాల్ డ్రైన్ లలో డ్రోన్ ద్వారా ఎంఎల్ ఆయిల్స్ స్ప్రే చేస్తున్నామని, దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు.