Breaking News

హెచ్.ఐ.వి/ఎయిడ్స్/రక్త దానం పై విధ్యార్థులకు పోటీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్టాటజి ఫర్ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ (డి.ఐ.యస్.హెచ్.ఎ) యన్.టి.ఆర్ జిల్లా ఆద్వర్యంలో శనివారం స్థానిక బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాల నందు విధ్యార్థులకు హెచ్.ఐ.వి అవగాహన పై పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యన్.టి.ఆర్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శాంసన్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల గౌరవ కలక్టర్ గారి ప్రారంభించిన మీకు తెలుసా అనే రెండు నెలల క్యాంపెయిన్ లో భాగంగా యన్.టి.ఆర్ జిల్లాలోని పాఠశాలలను ఈ పోటీలకు ఆహ్వానించడం జరిగిందని, ప్రతి స్కూలు కి ఇద్దరు చొప్పున జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిది, తొమ్మిది తరగతి చదువుతున్న వారిని ఆహ్వానించడం జరిగిందని, ఈ క్విజ్ లో పాల్గొన్న వారు బోయపాటి శివరామ కృష్ణయ్య, బిషప్ అజరయ్య, టి.యమ్.ఆర్.యమ్.సి మాచవరం, యం.కె బేగ్ అజిత్ సింగ్ నగర్, గాంధిజి యమ్.పి.యల్ ఒన్ టౌన్, పి.యస్.యం.సి ఒన్ టౌన్, కె.బి.సి జడ్.పి బ్యాయ్స్ పటమట, గోవిందరాజు పటమట నుండి పాల్గొన్నారని ఆయన అన్నారు. ఈ పోటీలలో హెచ్.ఐ.వి/ఎయిడ్స్, పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత, స్వచ్ఛంద రక్తదానం పై పరీక్షలను నిర్వహించామని ఆయన అన్నారు. ఈ పోటీలలో ప్రధమ స్థానంలో నిలిచిన గోవిందరాజులు, ద్వితియ స్థానంలో గాంధిజి యమ్.పి. యల్ ఒన్ టౌన్, తృతీయ స్థానంలో కె.బి.సి జడ్.పి బ్యాయ్స్ పటమట పాఠశాలలు గెలుపొందారని ఆయన అన్నారు. విధ్యార్థులకు ప్రశంసా పత్రాలను నగదు బహుమతులను త్వరలో అందజేస్తామని మొదటి రొండు స్థానాలలో ఉన్న వారు త్వరలో రాష్ట్ర స్థాయి లో జరిగే పోటీలలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పోటీలలో పాల్గొన్న విధ్యార్థులకు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.మల్లేశ్వర రావు, గుంటూరు, యన్.టి.ఆర్ జిల్లాల పర్యావేక్షణా అధికారి జి.వీరాస్వామి, కృష్ణా జిల్లా లారీఓనర్స్ అసోసియేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ వి.వి సాంబశివరావు, వాసవ్య మహిళా మండలి వలసకార్మికుల కార్యక్రమ ప్రాజెక్ట్ మేనేజర్ వి.రాజామోహన్ రావు, సిబ్బంది కె.శ్రీనివాసరావు, డి. వీరాంజనేయులు, ఎ.వి ప్రసాద్, యం.శేషు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *