-పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఉప ముఖ్యమంత్రి లక్ష్యం
-పల్లెటూర్లను, పట్టుగూళ్ళు చేయడమే పవన్ కళ్యాణ్ ఆశయం
-రైతు రాజ్యం తేవడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం
చంద్రగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి దేవర మనోహర తెలిపారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవర మనోహర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో డిప్యూటీ సీఎం శ్రీ కొణెదల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారని ఇందులో భాగంగా శుక్రవారం రోజున రాష్ట్రంలో 13326 పంచాయతీలలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి జాతీయ స్థాయిలో సైతం ప్రశంసలు అందుకున్నారని దీంతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఎంతో అభినందిస్తున్నారని ప్రత్యేకించి డిప్యూటీ సీఎం కొణెదల పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు గ్రామాలకు సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో ప్రత్యేక నిధులు కేటాయించి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు చర్యలు చేపట్టడం ప్రశంసనీయమున్నారు.
గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసి పంచాయతీలకు నిధులు కేటాయించకుండా గ్రామ సర్పంచులును రబ్బర్ స్టాంపుల్లా తయారుచేసి చెక్పవర్ ను సైతం తీసివేశారని, కూటమి అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. గ్రామ సభల ద్వారా ఉపాధి హామీ పథకం వల్ల ఎలాంటి లబ్ధి పొందవచ్చు అనే అంశం కూడా గ్రామాలలోని ప్రజలకు అవగాహన లేదని, గ్రామ సభల ద్వారా ఉపాధి హామీ పథకంలో 4 విభాగాలుగాను ,87 రకాల పనులను గ్రామ ప్రజల సద్వినియోగం చేసుకోవచ్చని అవగాహన కల్పించడం ఓ శుభ పరిణామం ఉన్నారు. గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి మౌలిక సదుపా యాలతో పాటు, మెజార్టీ గ్రామ ప్రజల అభిప్రాయాల మేరకు అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుంది అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో డిప్యూటీ సీఎం కొణెదల పవన్ కళ్యాణ్ గ్రామ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలలో ఉన్న 119 పంచాయితీల అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రభుత్వ అధికారులకు, గ్రామ స్థాయి నాయకులకు అభినందలను తెలిపి ప్రజలకు ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో తాను ముందుంటానని దేవర మనోహర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు శ్రీ హరి ,తపసి మురళి రెడ్డి ,జనసేన నాయకులు జనసేన సాయి ,మురళి ,మునికృష్ణ ,వీర మహిళ విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.