Breaking News

లఖ్-పతిదిదీ సన్మాన్ కార్యక్రమంలో ఎస్ హెచ్ జి మహిళాలకి రూ.57.15 కోట్లు చెక్కు పంపిణి , సన్మాన్ ధృవపత్రాలు అందచేత

-దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ఎస్ హెచ్ జి మహిళా సంఘాలు
-ఆర్ధిక పరిపుష్టి వనరుగా బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
-పాల్గొన్న కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మేల్యే రామకృష్ణా రెడ్డి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం సహాయక సంఘాల మహిళలకు సుస్థిర మైన జీవనోపాధులు కల్పించి ప్రతీ కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయలు పైన మిగులు ఆదాయం కల్పించాలనే ఉద్దేశ్యంతో దీస్ దయాళ్ అంత్యోదయ యోజన “పి ఎమ్ లఖ్-పతిదిదీ” కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఆదివారం స్ధానిక కలెక్టరేట్ లో జరిగిన లఖ్ – పతిదిదీ సన్మాన్ కింద తూర్పు గోదావరి జిల్లాలోని 517 స్వయం సహాయక సంఘాల మహిళలకు ఒకొక్క గ్రూప్ కు లక్ష రూపాయల చొప్పున 57 కోట్ల 15 లక్షలు చెక్కును అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తో కలిసి కలెక్టర్ చెక్కును పంపిణి చేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, స్థిరమైన జీవనోపాధి పద్ధతులను పాటించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు ద్వారా ఆర్థిక స్థిరత్వం సాధించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం అన్నారు. ఆ దిశలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, వ్యవసాయేతర లేదా సేవా రంగాల్లో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక లక్ష్యం గా ఆర్ధిక పరిపుష్టి దిశగా అడుగులు వేయాలని పిలుపు నిచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళలకి పని చేయగల సత్తా ఉందని , నూతన ఆవిష్కరణ లు దిశగా అడుగులు వేసే గ్రూపులను గుర్తించి వారిని మరింత ప్రోత్సహం అందించే క్రమంలో ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరుగుతొందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి స్వయంగా మధ్యప్రదేశ్ లోని జల్గావ్ గ్రామంకు వొచ్చి మహిళాలను అభినందిం చడం ద్వారా మరింత మందికి స్పూర్తి నిచ్చే కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగిందన్నారు.  స్వయం సహాయక సంఘాల ఏర్పాటు దిశలో ఆయా సభ్యుల పెట్టుబడి నిధి మేరకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగిందని పేర్కొన్నారు. నేడు దేశానికి ఆదర్శంగా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలు నిలవడం జరిగిందన్నారు. తూర్పు గోదావరి, కర్నూల్, అనంతపురం జిల్లాల్లో మహా సమాఖ్య ఏర్పడి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. క్లింటన్, బిల్ గేట్స్, అంగసాన్ సూకీ వంటి ఎందరో ప్రపంచస్థాయి నాయకుల గుర్తింపు కలిగిన మన సంఘాల మహిళలు నిలవడం జరిగిందన్నారు. స్వయం సహాయక సంఘాల తీసుకున్న రుణాలను జీవనోపాధి పద్ధతులను పాటించడం ద్వారా మరింత ఆర్ధిక పరిపుష్టి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ఆమేరకు దిన దిన అభివృద్ది చెంది నేడు 20 లక్షలు రుణం పొందేందుకు అర్హత సాధించడం జరిగిందన్నారు. ఆ మొత్తం లో అద్భుతాలు సృష్టించడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.  ఆమేరకు ఆర్ధిక, సామాజిక సాధికారిత సాధించేందుకు అవకాశా లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ దశాబ్దపు ప్రేరణ కలిగించే వ్యక్తుల్లో మన రాష్ట్రానికి చెందిన స్వయం సహాయక సంఘాల ఉండడం మనందరికీ గర్వకారణం అన్నారు.

అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పేద వర్గాలకు చెందిన కుటుంబాలు ఆర్థిక స్థిరత్వం కోసం స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి వారిని లఖ్ పతిదీదీ కార్యక్రమం కింద ఎంపిక చేయడం జరిగిందన్నారు. మహారాష్ట్ర లో జరిగిన కార్యక్రమంలో లఖ్ పతి దీదీ సన్మన్ కార్యక్రమంలో ప్రథాన మంత్రి  సాల్గొనడం జరిగిందన్నారు.  లఖ్ పతిదీదీ కార్యక్రమం కింద 517 స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు  బ్యాంకు రుణాలు కింద 57 కోట్ల 15 లక్షలు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. వీటిని మీ ఆలోచనలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టాలని కోరారు . ఆయా ఉత్పత్తులను మార్కెటింగు, నైపుణ్యం పెంపొందించే దిశగా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఆర్థికంగా బలోపేతం చేయడానికి అన్నీ విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

లఖ్-పతిదిదీ సన్మాన్ కార్యక్రమం కింద తూర్పు గోదావరి జిల్లాలో 100 రోజుల ప్రణాళిక కింద 3330 గ్రూపుల లక్ష్యం కాగా 4475 (134%) గ్రూపులను గుర్తించినట్లు తెలిపారు. కనీసం ఎస్ హెచ్ జి సంఘం పెట్టుబడి నిధి కింద రెండు సంవత్సరాలు నిండిన వారు అర్హులుగా పిడి మూర్తి పేర్కొన్నారు.

లఖ్-పతిదిదీ సన్మాన్ కింద మండలాలు వారీగా లబ్దిదారులు:
కడియం 31, రాజమండ్రి రూరల్ 23, నిడదవోలు 27 ,  ఉండ్రాజవరం 24 ,  పెరవలి 29 , కోరుకొండ 27 ,  సీతానగరం 26 , రాజానగరం 29 ,  కొవ్వూరు 23 ,  తాళ్లపూడి 22 , చాగల్లు 25 ,  రంగంపేట 31 ,  బిక్కవోలు 32 , అనపర్తి 31 , దేవరపల్లి 35 , నల్లజర్ల 33 , గోపాలపురం 33 , గోకవరం 36

శాసన సభ్యులు, కలెక్టర్ చేతుల మీదుగా మహిళా సభ్యులు సన్మాన్ ధ్రువపత్రాలు అందుకున్నారు

ఈ కార్యక్రమంలో డీ ఆర్ డి ఎ పిడి ఎన్ వివిఎస్ మూర్తి, ఎల్ డి ఎమ్ డివి ప్రసాద్, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *