-కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకృష్ణాష్టమి పండుగ సంధర్భంగా రాష్ట్ర ప్రభుత్వ శెలవు దినము ప్రకటించిన దృష్ట్యా ఆగస్ట్ 26 సోమవారం కలెక్టరేట్ లో, డివిజన్, మునిసిపల్ , మండల కేంద్రాలలో నిర్వహించాల్సి ” ప్రజా సమస్యల పరిష్కార వేదిక ” మీ కోసం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆర్జిలు ఇచ్చేందుకు వొచ్చే ఆర్జిదారులు, జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, అర్జీలు అందజేసేందుకు వ్యయ ప్రయాసలకోర్చి ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు ఆగస్ట్ 26 వ తేదీ.సోమవారం రావద్దని తెలియ చేయడమైనది.