గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర ప్రజలకు త్రాగునీరు అందించే ఉండవల్లి రా వాటర్ ప్లాంట్ 24 గంటలు రన్నింగ్ లోనే ఉండాలని, అందుకు తగిన విధంగా మోటార్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏయస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కమిషనర్ ఉండవల్లిలోని ముడినీటి సరఫరా ప్లాంట్, రిజర్వాయర్లను పరిశీలించి, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ప్లాంట్ లోని మోటార్ల సామర్ధ్యం, గుంటూరు నగరానికి ప్రతి రోజు పంపింగ్ చేస్తున్న నీటి వివరాలు, ప్రకాశం బ్యారేజ్ లోని నీటి లెవల్స్, విధుల్లో ఉన్న సిబ్బంది తదితర అంశాలు అధికారులను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ గుంటూరు నగరానికి త్రాగునీరు అందించే కీలకమైన ఉండవల్లి పంపింగ్ కేంద్రం పనితీరు మెరుగ్గా ఉండాలన్నారు. పంపింగ్ కేంద్రం 24 గంటలు పని చేయాలని, ఉన్న మోటర్లకు అదనంగా మరో మోటర్ ని స్టాండ్ బై గా ఉంచాలన్నారు. సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, బ్యారేజిలో నీటి నిల్వ వివరాలను ఎప్పటికప్పుడు తమకు తెలియచేయాలన్నారు. ప్లాంట్ పరిసరాల్లో సిసి కెమెరాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. ప్లాంట్ ప్రాంతానికి చుట్టూ కాంపౌండ్ నిర్మాణం చేయాలని ఎస్ఈని ఆదేశించారు.
పర్యటనలో ఎస్.ఈ శ్యాం సుందర్, ఈఈ శ్రీనివాస్, డిఈఈ శ్రీధర్, గుంటూరు నగర రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
Tags guntur
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …