నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
సేవా మూర్తి, విశ్వ మాత మధర్ థెరిస్సా విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఒక మధురానుభూతి ని కల్పించిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన మదర్ థెరిసా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నిస్వార్ధ సేవకు మారుపేరు మదర్ థెరీసా అన్నారు. విశ్వమాతగా పేరు పొందిన మదర్ థెరీసా విగ్రహావిష్కరణ ద్వారా యువతకు, భవిష్యత్ తరాలకు ఆమె యొక్క గొప్పతనాన్ని తెలియ చేసేందుకు అవకాశం ఉందన్నారు. వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మదర్ తెరిసా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News