గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో రోడ్ల మీద, మార్జిన్లలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే ఆక్రమణలను, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని, పట్టణ ప్రణాళిక దళం తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నగరంలో రోడ్ల ఆక్రమణలు, ఫ్లేక్సీల తొలగింపు పై పట్టణ ప్రణాళిక దళంతో నగరంలో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రదాన రోడ్ల మీద ఇష్టానుసారంగా ఆక్రమణలు జరుగుతున్నాయని, ట్రాఫిక్ కి కూడా తీవ్ర ఆటంకంగా ఆక్రమణలు ఉన్నాయన్నారు. రోడ్ల విస్తరణ జరిగినప్పటికీ ఆక్రమణల వలన ఉపయోగం లేకుండా పోతుందన్నారు. అలాగే వివిధ కార్యక్రమాల పేరుతొ అనుమతి లేకుండా ఫ్లెక్సీ బ్యానర్లు కడుతున్నారని, అవి గాలికి ఊడిపోయి వాహనాల మీద పడుతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆక్రమణల నియంత్రణ, ఫ్లెక్సీ బ్యానర్ల తొలగింపు చేపట్టాల్సిన పట్టణ ప్రణాళిక దళం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఇక నుండి 7 రోజుల్లో రోడ్ల మీద ఆక్రమణలు, ఫ్లేక్సీలను నూరు శాతం తొలగించాలని స్పష్టం చేశారు. దళం వారీగా ప్రతి రోజు తొలగించిన వాటి వివరాలతో నివేదిక ఇవ్వాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిని విధుల నుండి తొలగించడం, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
Tags guntur
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …