Breaking News

నిబంధనల మేరకే నిర్దేశించిన గడువులోపు బదిలీలు చేపట్టాలి

-తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నిబంధనల మేరకే, నిర్దేశిత గడువులోగా బదిలీలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీ లపై ఆంక్షలు సడలించి కొన్ని ముఖ్య శాఖలలో బదిలీలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో పలు శాఖలలో జి. ఓ మేరకు బదిలీల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలపై జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ తో కలిసి మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బదిలీల నిబంధనల మేరకు ఐదు సంవత్సరాలు పూర్తి అయిన వారు కంపల్సరీ బదిలీ,రిక్వెస్ట్ బదిలీలు తదితర అంశాలు ప్రభుత్వం నుండి అందిన ట్రాన్స్ఫర్ జీఓ లోని నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు, ఫిర్యాదులకు తావు ఉండరాదని సూచించారు. కంపిటెంట్ అథారిటీ వారు సదరు బదిలీలు చేపట్టాల్సి ఉంటుందని, రేపు ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్, అన్నమయ్య జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా కలెక్టర్లు కలిసి చర్చించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీటిలో రెవెన్యూ, పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, గ్రామ వార్డు సచివాలయం శాఖ, గనులు భూ గర్భ శాఖ, ఇంజినీరింగ్ సిబ్బంది అన్ని శాఖలు, దేవాదాయ శాఖ, రవాణా శాఖ, ఈఎఫ్ఎస్ అండ్ టి, పరిశ్రమల శాఖ, విద్యుత్ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖల్లో బదిలీలు జరగనున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిఈఓ ఆది శేషా రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, గ్రామ వార్డు సచివాలయం అధికారిని సుశీల దేవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *