-డిఆర్వో నరసింహులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎలక్ట్రోరల్ రోల్స్ నందు నమోదు కొరకు CEO/ECI వారు షెడ్యూల్ జారి చేసియున్నారని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సదరు షెడ్యూల్కు అనుగుణంగా ఓటరు నమోదుకు అర్హత తేదీగా 01.11.2024ని సూచించినారనితెలిపారు. ఇందుకు ప్రభుత్వ మరియు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో , జూనియర్ కళాశాలలో , ఉన్నత విద్య సంస్థలలో ఆరు సంవత్సరాల లోపు కనీసం మూడు సంవత్సరాల పాటు ఉద్యోగ భాద్యతలు నిర్వహిస్తూ, తాము ఓటరుగా నమోదు అయిన మండలంలో మండల తహసిల్దార్ లేదా మండల అభివృద్ది అధికారి (MPDO) వారికి గాని నిర్ణీత ఫారం లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ధరఖస్తూను 03.09.2024 వ తేది లోపు ఓటరు నమోదుకు ఫారం 19 తో పాటు సర్వీసు సర్టిఫికేట్, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు జత పరచి దరఖాస్తును సమర్పించాలని తెలియ చేశారు. సంబంధిత ఫారం 19 అన్ని మండల తహసిల్దార్ MPDO అధికారి వారి కార్యాలయములో అందుబాటులో కలవని తెలియ చేశారు.