తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా అటవీ శాఖ అధికారి సతీశ్ రెడ్డి మరియు సంబంధిత అధికారులతో కలిసి వన మహోత్సవ కరపత్రాలు మరియు వన మహోత్సవం 2024 పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ వన మహోత్సవం 2024 కరపత్రాలు మరియు పోస్టర్ ను సంబంధిత అటవీ శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంప్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అంకిత భావంతో హరితాంధ్ర ప్రదేశ్ కు కంకణ బద్దులై ఈనెల 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారని తెలిపారు. హరితాంధ్ర కోసం అడుగేద్దాం ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం అనే నినాదంతో ప్రతి ఒకరు హరిత యజ్ఞంలో పాలు పంచుకోవాలని, మన రాష్ట్రాన్ని, జిల్లాను, ప్రతి ఊరును పచ్చదనంతో కళకళ లాడేలా విరివిగా మొక్కలు నాటేలా కంకణ బద్ధులవుదాం అని యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అటవీ అధికారి సామాజిక అటవీ విభాగం తిరుపతి ధర్మరాజు, ఫారెస్ట్ రేంజ్ అధికారిణి శ్రీమతి పీ. మాధవి తదితర అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …