-జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా కొనుగోలు కమిటీ చైర్మన్ శుభం బన్సల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలోని 12 ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ లోని 2492 అంగన్వాడి కేంద్రాలకు అవసరమైన కందిపప్పు (1Kg ప్యాక్) సప్లమెంటరీ న్యూట్రీషన్ ప్రోగ్రామ్ ద్వారా సరఫరా చేయుటకు ఆసక్తి గల ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ నందు రిజిష్టర్డ్ అయిన Millers/Wholesalers/Govt. Agencies వ్యాపారస్తులు నుండి టెండర్ కోరనైనది. టెండరు అమ్మకం ప్రారంభ తేది: 29.08.2024 ఉ:10గం. టెండరు అమ్మకం చివరి తేది: 04.09.2024 మ:1 గం. టెండరు దాఖలకు చివరి తేది: 04.09.2024 మ.1.30 గం. టెండర్ ఓపెనింగ్ తేది: 04.09.2024, 3.30 pm ఇతర వివరములకు జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారి, తిరుపతి జిల్లా, 5 వ అంతస్తు , బి-బ్లాక్ , కొత్త కలెక్టరు వారి కార్యాలయ ప్రాంగణము తిరుపతి వారిని సంప్రదించగలరని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఛైర్మన్ జిల్లా కొనుగోలు కమిటీ, తిరుపతి శుభం బన్సల్ గారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.